పీఎంఓ నుంచి ఆదేశాలతోనే పాక్ లో ఉగ్రవాదులు..

దేశంలో ఎన్నికల ముందు పశ్చిమ దేశాలు ఒక్కో నివేదికన విడుదల చేయడం ప్రారంభించాయి. తాజాగా పీఎంఓ ఆదేశాల ప్రకారమే భారత గూఢచారులు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను చంపు..

Update: 2024-04-06 08:21 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ

సార్వత్రిక ఎన్నికలకు ముందు వరుసగా దేశంలో రెజిమ్ చేంజ్ పాలసీల కుట్రలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. ఇంతకుముందే హ్యాపీ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను ప్రచురించి పాలస్తీనా, శ్రీలంక, పాకిస్తాన్ ల కంటే భారతీయులు తక్కువ స్థాయి సంతోషంగా ఉన్నారని ఓ కుట్రను అమలు చేసిన పశ్చిమ దేశాలు తాజాగా మరో కుట్రకు తెరలేపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం జాతీయ భద్రతను కాపాడే వ్యూహంలో భాగంగా పాకిస్థాన్‌తో సహా విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులను హత్య చేయిందని ది గార్డియన్ అనే పత్రిక తన నివేదికలో పేర్కొంది.

'పీఎంఓ నుంచి ఆదేశాలు '
పాకిస్తాన్‌లకు చెందిన ఇంటెలిజెన్స్ తమకు ఈ విషయం స్వయంగా చెప్పాయని, పాక్ దర్యాప్తు అధికారులు పంచుకున్న పత్రాలను ఆధారాలను ఈ కథనానికి బేస్ గా పేర్కొంంది. భారత విదేశీ గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా లేదా ఆర్ అండ్ ఏడబ్ల్యూ) నేరుగా ప్రధాని ఆదేశాలతో ఈ హత్యలకు శ్రీకారం చుట్టినట్లు ది గార్డియన్ అభియోగాలు మోపింది. పుల్వామా దాడి తరువాత ఈ హత్యలు ఊపందుకున్నాయని ఏకంగా తీర్పు చెప్పింది.
కెనడియన్, యుఎస్ ప్రభుత్వాలు తమ గడ్డపై జరిగిన హత్యాయత్నాల్లో భారతీయ ఏజెంట్ల పాత్రపై చేసిన పలు అంశాలు ఈ ఆరోపణలకు మద్దతు ఇస్తున్నాయని పేర్కొంది. జూన్ 2023లో సిక్కు ఉగ్రవాది, గ్యాంగ్ స్టర్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారతదేశం కుట్ర పన్నిందని కెనడా తీవ్రంగా ఆరోపించింది.
కానీ దీనికి సంబంధించి ఒక్క ఆధారం కూడా కెనడా ఇంతవరకూ భారత్ కు ఇవ్వలేదు. అలాగే తన మిత్ర దేశాలైన ఫైవ్ ఐస్ కు సైతం ఇవ్వలేదు. మరోవైపు, అమెరికా తన గడ్డపై మరో ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై విఫలమైన హత్యా కుట్రలో న్యూఢిల్లీ పాత్రను అభియోగాలు మోపింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అమెరికా కోర్టులోనే ఆ దేశ దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలను సమర్పించలేదనే విషయాన్ని గార్డియన్ ఉద్దేశపూర్వకంగా విస్మరించింది.
2020 నుంచి పాక్‌లో 20 మంది ఉగ్రవాదుల ఖేల్ ఖతం
ది గార్డియన్ ప్రచురించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి పాకిస్తాన్‌లోనే దాదాపు 20 మంది ఉగ్రవాదుల హత్యలకు భారతదేశం రూపకల్పన చేసిందని ఆరోపించింది. గుర్తుతెలియని సాయుధులు ఈ హత్యలు చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించి ఒక్క వ్యక్తిని కూడా పాకిస్తాన్ కనీసం గుర్తించలేదు. కొంతమంది ఆర్ అండ్ ఏ డబ్ల్యూ కార్యకర్తలు తమకు ఈ సమాచారం అందించినట్లుగా పేర్కొంది. 'స్లీపర్ సెల్స్ చేత పథకం రూపొందించబడి, స్థానికులచే అమలు చేయబడింది' అని ఓ వార్తకథనాన్ని ప్రచురించింది. ఇందుకోసం స్థానిక ఉగ్రవాదులని సైతం వాడుకుంటున్నారని, అంతే కాకుండా స్థానిక నేరస్తులు, పేదలను సైతం వినియోగిస్తున్నారని ఆరోపించింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా హతమైన ఉగ్రవాదుల్లో కాశ్మీరీ ఉగ్రవాది జాహిద్ అఖుంద్, జైషే మహ్మద్ కమాండర్ షాహిద్ లతీఫ్, ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ ముజాహిదీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్, భారత్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న సలీమ్ రెహ్మానీలు ఉన్నారు. వీరంతా మనదేశంలో వివిధ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించి పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారు.
ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేయడంలో పాల్గొన్న అఖుంద్ అలియాస్ జహూర్ మిస్త్రీ విషయంలో, ది గార్డియన్ ప్రకారం అఖుంద్ కదలికలు కోసం నెలల తరబడి ఓ ‘రా’ హ్లాండ్లర్ కు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తన గుర్తింపును నిర్ధారించేందుకు జర్నలిస్టుగా నటిస్తూ నేరుగా అతడిని సంప్రదించింది. చివరకు 2022 మార్చిలో కరాచీలో ఆఫ్ఘన్ దేశాలు అతనిని ఆ ఉద్యోగం కోసం మిలియన్ల రూపాయలు చెల్లించాయని నివేదిక పేర్కొంది. హంతకులు సరిహద్దుల మీదుగా పారిపోయారని, అయితే వారి హ్యాండ్లర్లను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారని పేర్కొంది.
UAE పాత్ర
పాకిస్తానీ ఏజెంట్లు మాట్లాడుతూ.. చాలా హత్యలు UAE నుంచి మానిటర్ చేయబడ్డాయి, ఇక్కడ RAW స్లీపర్ సెల్‌ వ్యవస్థ బలంగా ఉంది, వారు దశలవారీగా కార్యకలాపాలను ప్లాన్ చేస్తారు. హత్యల కోసం నేరస్థులు లేదా పేద వ్యక్తులకు లక్షలాది రూపాయలు చెల్లించగా, లావాదేవీలు ఎక్కువగా దుబాయ్ ద్వారా జరిగాయి, నేపాల్, మాల్దీవులు, మారిషస్‌లలో హత్యలను పర్యవేక్షించే RAW హ్యాండ్లర్ల సమావేశాలు కూడా జరిగాయని నివేదిక పేర్కొంది.
అనేక హత్యాప్రయత్నాల తర్వాత నిషేధిత జైషే మహ్మద్ ఉగ్రవాది లతీఫ్‌ను యుఎఇలో ‘రా ’ రిక్రూట్‌మెంట్ తీసుకున్న 20 ఏళ్ల పాకిస్తాన్ యువకుడు హతమార్చాడని నివేదిక పేర్కొంది. హత్య చేయడానికి అతనికి 1.5 మిలియన్ పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు ₹4.2 లక్షలు) చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. పీర్‌ని చంపడానికి యుఎఇ నుంచి కూడా ప్రణాళిక చేయబడింది "దుబాయ్ నుంచి లావాదేవీల రసీదులు హంతకులకు మిలియన్ల రూపాయల చెల్లింపులను చూపించినట్లు" నివేదిక పేర్కొంది.
హత్యలను ప్రేరేపించినది ఏమిటి?
2019లో పుల్వామా దాడి జరిగింది. జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మరణించిన తర్వాత విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులను అంతమొందించే ఆపరేషన్ ఊపందుకున్నదని ఇద్దరు భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ది గార్డియన్‌తో మాట్లాడారు.
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, భారత్‌పై దాడులకు ప్లాన్ చేసే ముందు ప్రభుత్వం బెదిరింపులను తొలగించేందుకు సిద్ధమైందని నివేదిక పేర్కొంది. "పుల్వామా తర్వాత, దేశం వెలుపల ఉన్న ఎలిమెంట్స్ ని ఏరివేయడానికి ఓ కొత్త విధానం తీసుకొచ్చారని" అని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ది గార్డియన్‌తో చెప్పారు. "మేము దాడులను ఆపలేకపోయాము ఎందుకంటే చివరికి వారి సురక్షిత స్థావరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి, కాబట్టి మేము మూలానికి చేరుకోవలసి వచ్చింది" అని ఆపరేటివ్ జోడించారు.
మొసాద్, కేజీబీ సాహసాలు
న్యూఢిల్లీ కార్యకలాపాలు వరుసగా ఇజ్రాయెల్, పూర్వ సోవియట్ యూనియన్ గూఢచారి సంస్థలైన మొస్సాద్, KGBల నుంచి ప్రేరణ పొందాయని భారత రా హ్యండర్లు తెలిపారు. సౌదీ జర్నలిస్ట్, అసమ్మతి వాది జమాల్ ఖషోగ్గి హత్య నుంచి భారతదేశం ఎలా గుణపాఠం తీసుకోవాలో కూడా పిఎంఓలో రా అధికారులు చర్చించారని ఆపరేటివ్‌లలో ఒకరు చెప్పారు. "సౌదీలు దీన్ని చేయగలిగితే, మనం ఎందుకు చేయకూడదు?" అని ఒక సీనియర్ అధికారి ఒక సమావేశంలో చెప్పారు. భారతీయ హ్యండ్లర్ చెప్పినట్లు పేర్కొన్నారు.
పన్నూన్, నిజ్జర్..
సిక్కు తీవ్రవాది నిజ్జర్‌ హత్య, పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలపై న్యూఢిల్లీ పాత్రను ఖండించింది, కెనడా, యుఎస్ ఆరోపణలు చేసిన తర్వాత పాకిస్తాన్‌లో లక్ష్యంగా చేసుకున్న హత్యలను నిలిపివేయాలని భారతదేశం ఇటీవల ఆదేశించిందని ఒక భారతీయ హ్యండ్లర్ ది గార్డియన్‌తో చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన సిక్కులు ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత, ఖలిస్తానీ నాయకులు కూడా భారతీయ ఏజెంట్ల రాడార్‌లో ఉన్నారని ఇద్దరు భారతీయ హ్యండ్లర్ చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న సిక్కు తీవ్రవాదులు భారత్‌లో నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని భారత ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు వారు తెలిపారు. లాహోర్‌లో ఉన్న హై ప్రొఫైల్ ఖలిస్తానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ను కూడా భారత ఏజెంట్లు చంపారని పాక్ దర్యాప్తు అధికారులు ఆరోపించారు.
ఆరోపణలను కొట్టిపారేసిన విదేశాంగ శాఖ
అయితే ఆరోపణలన్నీ ఊహజనితమైనవిగా భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఇది భారత వ్యతిరేక ప్రచారంగా పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు చేయడం "భారత ప్రభుత్వ విధానం కాదు" అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
ఒక మాజీ సీనియర్ RAW అధికారి ది గార్డియన్‌తో మాట్లాడుతూ, ఈ హత్యలు ఇస్లామాబాద్‌చే నిర్వహించబడి ఉండవచ్చు. చనిపోయిన వారంతా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులన్ని, వారి బతికి ఉంటే తిరిగి ఎక్కడ ఆర్థిక ఆంక్షలు విధిస్తారో అని భయపడే ఈ హత్యలు చేసి భారత్ పై నిందలు మోపి ఉండవచ్చని పేర్కొంది. "న్యాయవిరుద్ధమైన హత్యలు" ఏజెన్సీ విధానంలో భాగం కాదన్నారు.
పాకిస్థాన్ ఎందుకు మౌనంగా ఉంది?
మరణించిన వారిలో ఎక్కువ మంది ఉగ్రవాదులు నిషేధిత మిలిటెంట్ గ్రూపులకు చెందిన సహాయకులు కావడంతో పాక్ అధికారులు ఈ హత్యలపై నోరు మెదపకుండా ఉన్నారని విశ్లేషకులు ది గార్డియన్‌తో అన్నారు.
Tags:    

Similar News