జెలెన్ స్కీని లొంగదీసుకునే ప్రయత్నం విఫలమయిందా?
అంతర్జాతీయ పరిణామాలను ఇది ఊహించని కుదుపులా మారుతుందా?;
By : KS Dakshina Murthy
Update: 2025-03-01 12:03 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ ఇద్దరు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడిని లొంగదీసుకునే ప్రయత్నంలో తమ ప్రవర్తనను బయటపెట్టుకున్నారు. అయితే దేశాధినేతల మధ్య వీధుల్లో జరిగినట్లు బిగ్గరగా అరుపులు జరగడం చాలా అరుదు.
ఇది ఇటీవల రాజకీయ చరిత్రలో అనూహ్యంగా అపూర్వమైనదనే చెప్పాలి. ఇదేదో రియాలిటీలో షో లా మాదిరి ముందుగా అనుకున్న స్క్రిప్టు ప్రకారం జరగలేదు. అసలు ఇలాంటి పరిణామం జరగుతుందని అధినేతలు సైతం ఊహించలేకపోయారు.
అమెరికా విదేశాంగ విధానంలో మార్పు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి ట్రంప్ వచ్చాక, దాని విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. రష్యా- ఉక్రెయిన్ యుద్దం ముగింపు కోసం ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో దేశాధినేతల మధ్య అరుపుల పోరాటం చోటు చేసుకుంది.
అంతర్జాతీయ పరిణామాలను చాలా దగ్గరగా పరిశీలించే వారికి అలాగే దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులకు వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన దశాబ్దాలుగా కాకపోయినా, సంవత్సరాల తరబడి గుర్తుండే ఉంటుంది. ప్రజలకు ఇది ఒక జ్యూసీ న్యూస్.
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక అంశంపై నాయకులు బహిరంగంగా గొడవకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఇక్కడ తీర్మానాలు స్పష్టంగా ఉన్నాయి. యుద్దాన్ని ముగించడం తప్ప జెలెన్ స్కీకి సాధ్యమైన ఒప్పందం ఏమీ లేదు.
ఉక్రెయిన్ భద్రతకు ఎటువంటి హమీ లేదు. ప్రస్తుతం జరగుతున్న సూచనల ప్రకారం.. జెలెన్ స్కీ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని అప్పగించాలని ట్రంప్ బృందం కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడికి రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఇవేవీ ముందుకు సాగడం లేదు.
అమెరికా ద్రోహం చేసిందా?
అమెరికా విదేశాంగ విధానం రెండో ప్రపంచ యుద్దం తరువాత మొన్నటి వరకూ స్థిరంగా ఉంది. ప్రభుత్వాలు మారిన దానితో దౌత్య సంబంధాలు నెరపడానికి ఎప్పుడూ ఆటంకం కాలేదు. అది మిత్రదేశాలకు ఎంతో ఉత్సాహం కలిగించింది. వాటి సంబంధాలు ఇంతకాలం కొనసాగడానికి ఇదొక కారణమైంది. ఇన్నాళ్లు అమెరికా పై ఉన్న విశ్వాసం ట్రంప్ ఒక్క ఉదుటున కూల్చివేశాడు.
ఉక్రెయిన్ ఇప్పుడూ రష్యాతో పోరాడుతోందంటే కారణం.. అమెరికా ఇచ్చిన ఆయుధాలు, నిధులే కారణం. కానీ వాటిని ఇకముందు ఇచ్చేది లేదని ట్రంప్ తెగేసి చెప్పారు.
నాటో భవిష్యత్ ఏంటీ?
కీవ్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ఉక్రెయిన్ ను కాపాడటానికి సభ్యత్వం అవసరం అప్పట్లో జో బైడెన్ వాదించారు. మా సరిహద్దు దగ్గరలోకి అమెరికా రావడం ఏంటనీ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది నిజానికి బైడెన్- పుతిన్ కు పరువు సమస్యగా మారింది. ఉక్రెయిన్ ను ఎట్టిపరిస్థితుల్లో నాటోలో చేర్చుకోకూడదని ఇటూ పుతిన్, చేర్చుకోవాలని బైడెన్ కొన్ని యూరోపియన్ దేశాలు గిరీగీసుకుని కూర్చోవడంతో రెండు దేశాల మధ్య యుద్దం ప్రారంభం అయింది.
పుతిన్ దూకుడుగా వ్యవహరించడంతో ఉక్రెయిన్ చాలావరకూ దెబ్బతింది. లక్షలాది మంది మరణించారు. కీవ్ కు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలు అన్ని కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.
లక్షలాది మంది ప్రజలు దేశం విడిచిపారిపోయారు. నాటో సభ్యత్వం కోసం ఇంత పెద్ద యుద్దం జరగడం అవసరమా? అనే మౌలికమైన ప్రశ్న సైతం ఇప్పుడూ తలెత్తుతుంది.
అమెరికా, నాటో అండ ఉన్నప్పటికీ ఉక్రెయిన్ ఏదైన సాధించిందా అంటే ఏమీ లేదు. కానీ కొన్ని కీలక భూభాగాలను అది రష్యాచేతిలోకి జారవిరుచుకుంది. రష్యా వెనక్కి తగ్గదని పుతిన్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలకు ట్రంప్ కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడూ అమెరికా పక్కకు తప్పుకుంది. ఇక కీవ్ స్వయంగా క్రిమ్లిన్ తో పోరాడలేదు. దాని ఆశాకిరణం కేవలం యూరప్ మాత్రమే. కానీ అమెరికానుకాదని అది ముందడుగు వేయగలదా? అనేదే పెద్దప్రశ్న.
దాని దగ్గర పెద్దగా ఆర్థిక వనరులు, మానవ వనరులు లేవు. దాని పరువు కాపాడుకోవడానికి కొంత సాయం చేసే పరిస్థితి ఉండవచ్చు కానీ ట్రంప్ దానిపై ఏమంటారో అనే డైలామాలో ఉంటాయి. అమెరికా కన్నెర్ర చేస్తే దాని మనుగడ సాగడం చాలా కష్టం.
అమెరికా - యూరప్ బంధాలు మునపటి లా ఉంటాయా?
ప్రస్తుతం ఉక్రెయిన్ కు ఎలాంటి అవకాశాలు లేవని ట్రంప్ చెప్పినదాంట్లో అబద్దం ఏమి లేదు. వైట్ హౌజ్ లో మన చూసింది చాలా గందరగోళ పరిస్థితి. కొంతమంది విశ్లేషకులు చెప్పినట్లుగా అన్యాయమైన పోరాటానికి ఇది ముగింపు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పుతిన్ చిరునవ్వుతో ఉండేలా ట్రంప్ తీసుకున్న జాగ్రత్త అనుకోవచ్చు.
అమెరికా యూరోపియన్ సంబంధాల విషయానికొస్తే పరిస్థితులు మళ్లీ ఒకప్పటీలా ఉండే సూచనలు కనిపించడం లేదు. కానీ యూరప్ మొత్తం కూడా అమెరికా పైనే ఆధారపడి ఉంది. జర్మనీ వంటి పెద్ద దేశాలు అమెరికాకు కీలక సైనిక స్థావరంగా ఉంది.
రెండో ప్రపంచ యుద్ద సమయంలో నాజీల నుంచి ఫ్రాన్స్ ను రక్షించినందుకు ఫ్రెంచీ వారు ఇప్పటికీ అమెరికాకు రుణపడి ఉంటారనే భావన ఉంది. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ అమెరికాను కాదని ఎంతదూరం వెళ్లగలరు. ఒకప్పటి సూపర్ పవర్ గ్రేట్ బ్రిటన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.
వైట్ హౌజ్ ఉదంతంపై టెన్ డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి ఉక్రెయిన్ ఆచరణాత్మకంగా అని విధాల ఓ బొచ్చెను పట్టుకుని ఉండాల్సిందే. ఇప్పటికైన హస్య నటుడు జెలెన్ స్కీని పాలిటిక్స్ అంటే జోక్ కాదని వాస్తవం అర్థమై ఉండొచ్చు.