చేపలు పట్టడం సరే! తిమింగలాల మాటేమిటి?

భయపెడుతున్న తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి

Update: 2025-09-19 07:41 GMT

అవినీతి చేపలను యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వలపన్ని పట్టుకోవడం బాగానే ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులను సంపదను కూడబెట్టారని చెప్పడం మరీ బాగానే ఉంది. కానీ వల వేసిన మనిషినీ వలను సైతం ఎత్తుకపోతున్న తిమింగలాల వంటి వారి అవినీతి అక్రమాల పైన క్రమంగానైనా చర్యలు గైకొనక తాత్సారం చేయడం వెనుక జరుగుతున్న సంగతి ఏమిటి? మతలబు ఏమిటి?? మర్మ కర్మలేమిటి??? ప్రజల చూపును అవినీతి తిమింగలాల పై నుంచి మరలించే క్రమంలొనే అవినీ(తి)టి చేపలను పడుతున్నారా???? ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు త్వరలో పూర్తి కానున్నా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అధికార పార్టీ పట్ల ప్రజలకు కలుగుతున్న అనుమానాలకు, సందేహాలకు, వేసుకుంటున్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన రాజకీయ వాతావరణం ఏర్పడినది.ఇటీవల తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకొని తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏతెంచినవి.

2023 చివరలో అధికారం కోల్పోవడానికి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఇంకా తమ కుటుంబ సభ్యుల పరిపాలన క్విడ్ ప్రోక గా ఆర్థిక లావాదేవీలు కావనుకుంటున్నారు . అధినాయకుడు వారి పిల్ల జెల్లా ప్రజలను ఎవరిని కలవక రాజ భోగాలు అనుభవించారు. విపరీతమైన అహంకారంతో విచిత్రంగా తమ సోషియల్ మీడియా చానళ్ల ద్వారా ప్రజలలో అనేక గందరగోళాలను కలగడానికి ఆస్కారం ఏర్పడినది. మరోవైపు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసి చాప కింద నీరులా ప్రజలను మాయ చేస్తున్న విషయం మరొకవైపు కొనసాగుతున్నది. ఉట్టికి ఎగరలేని వారిని స్వర్గానికి ఎగిరేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు 20 25 సంవత్సరంలో కూడా 1983 సంవత్సరంలో వలె నాయకులను ఆయా మీడియా యాజమాన్యాలు నాయకులను తయారు చేసే ప్రక్రియను 22వ శతాబ్దపు ఉత్తరార్థంలో తమ తమ భుజాల మీద మోయడానికి చతుష్షష్టి కళలను ప్రజలపై ప్రయోగిస్తున్నారు.

విచారణలు విచారాలు

2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రం శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాటి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వాక్యాతుర్యంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం పాలన లో జరిగిన అవినీతి అక్రమాల గురించి తెలంగాణ ప్రజలను చైతన్య పరచడమే కాకుండా ఓటర్లను అప్రమత్తం చేశారు. తత్పలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ల ద్వారా అనేక హామీలను ప్రజలకు ఇచ్చారు. ఒక దశలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చర్లపల్లి జైల్లో కల్వకుంట్ల కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ కట్టించి ఇస్తానని ఒక అడుగు ముందుకు వేసి ప్రకటించాడు. తెలంగాణను ప్రసాదించిన తల్లి సోనియాగాంధీ సాక్షిగా ప్రజలు ఆయన మాటలను విశ్వసించారు. తీరా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం లోని పెద్దలు కళ్ళు తెరిచి చూసేసరికి చీకి పారేసిన బొక్కలు, పీకి పారేసిన కోడి బూరులా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపించాయి.

రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనేక హామీలను ప్రజల ముందు ఉంచుతారు. అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో తెలిపే తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తారు. అధికారంలోకి వచ్చాక, అసలు ప్రజలు కోరుకున్నట్టు కాకుండా ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే తాము కోరుకున్న విధంగా తమను వెనుక ఉండి నడిపిస్తున్న బడా పారిశ్రామికవేత్తలతో,కాంట్రాక్టర్లతో చేతులు కలిపి క్విడ్ ప్రోకోగా కోరిన విధంగా నడుచుకోవడం మన పాలకులకు అలవాటుగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఒక దర్యాప్తు సంస్థ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కాకుండానే ప్రభుత్వ అవసరాల రీత్యా సిట్ ను ఏర్పాటుచేసి ఆయా సంఘటనల పైన విషయాలపైన దర్యాప్తు కోసం ఆదేశిస్తారు. ఇవే కాకుండా అవసరమైతే జ్యూడిషియల్ కమిషన్ రిటైర్డ్ జడ్జితో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తారు. ఇక పోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సి.బి.ఐ, ఈ.డి. తదితర దర్యాప్తు సంస్థలు ఉంటాయి. సందర్భానుసారంగా ఈ సంస్థలను ఫలానా విషయం గురించి విచారణ జరపమని

ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ సంస్థలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఇవన్నీ స్వతంత్ర దర్యాప్తు సంస్థలే కానీ ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తుంటాయి. స్వయం ప్రతిపత్తి సంస్థలే కానీ అధికార పార్టీ ఆదేశాల మేరకు పని చేయవలసి ఉంటుంది .

ఇందులో మొత్తంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నాయకుల పైన విచారణలు ఉంటాయి.రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు ఉండే అవకాశాలు ఉన్నాయి .

అయితే చిక్కు అంతా ఎక్కడ అంటే జ్యూడిషల్ విచారణలో ఒకవైపు ఏసీబీ విచారణలు సిబిఐ ఈడి దర్యాప్తులు మరోవైపు జరుగుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని కేసులలో చార్జీ షీట్లు ఆయా న్యాయస్థానాల ముందు సమర్పిస్తారు. జుడీసీఎల్ ఎంక్వయిరీలు ఆయా ప్రభుత్వాలకు విచారణ తమ విచారణ నివేదికలను అందజేస్తారు. అతిధి వేదికలను అట్టి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి సంబంధిత నిందితుల పైన చర్యలు తీసు కోవాలి . రాష్ట్ర శాసనసభలు కేంద్ర పార్లమెంటు అనేక అనేక విషయాల విచారణ జరిపి వేదికలను ఆయా ప్రభుత్వాలకు సమర్పిస్తారు కానీ ఆ నివేదికల తేల్చి చెప్పిన ఫైండింగ్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అల్మారాలలో ఆ ఫైళ్లు కుంభకర్ణుడి నిద్ర పోతుంటాయి. ప్రభుత్వాలు వేసిన విచారణ కమిటీలు ఇచ్చిన వేలాది పేజీల నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వందలాదిగా పెండింగ్లో ఉన్నాయి.

ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఇవ్వవచ్చును. విద్యుత్ కమిషన్ జుడిషియల్ కమిషన్ వేసి నివేదికలో విద్యుత్ కొనుగోళ్లలో 1300 కోట్ల అక్రమాలు జరిగాయని జ్యుడీషియల్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినది. కానీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యంగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముఖ్యంగా జరిగిన టీజీపీఎస్సీ నియామకాలు ,ఈ కార్ల రేసు లో, గంటల గంట నగరాలకు జంట నగరాలకు మంచినీళ్లు అందించే జంట జలాశయాల ఎఫ్ టి ఎల్ బఫెలో బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన ఫామ్ హౌస్ లు మరియు కాళేశ్వరంలో అక్రమాలపై ప్రభుత్వం వేసిన సిట్ ఏసీబీ దర్యాప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం ఇప్పటికి గత ప్రభుత్వం 2023 వరకు వివిధ పథకాలలో పెండింగ్ పెట్టిన నిధుల వివరాలను ప్రజా ప్రజాక్షేత్రంలో ఉంచలేకపోయింది.

ఇంకా కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ విచారణలు దర్యాప్తులకు నివేదికల పైన అతిగతీ లేకుండా పోతే అయితే ప్రజాస్వామ్యం పైన ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వసనీయత నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నది.

Tags:    

Similar News