రెండో రోజుకు చేరిన ఢిల్లీ ఆప్ మంత్రి అతిషి నిరాహార దీక్ష

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి నిరాహార దీక్షకు కారణమేంటి? ఆమె కేంద్రాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు?

Update: 2024-06-22 07:12 GMT

ఢిల్లీవాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధానిలో గత కొన్నివారాలుగా నీటి సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటి కష్టాలను తీర్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ జలమంత్రిత్వశాఖ మంత్రి అతిషి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆమె నిరవధిక నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. బీజేపీ పాలిత హరియాణ ప్రభుత్వం తమకు రావాల్సిన నీటివాటాను విడుదల చేయడం లేదని ఆరోపించారు. తమ వాటా దక్కేవరకు దీక్ష విరమించేదిలేదని పేర్కొన్నారు.

100 ఎంజిడిలు తక్కువ..

‘‘నీళ్ల కోసం ఢిల్లీ పక్క రాష్ట్రాలపై ఆధారపడుతుంది. నదులు, కాలువల ద్వారా 1,005 మిలియన్ గ్యాలన్ల (ఎంజిడి) నీటిని పొందుతున్నాం. హర్యానా నుంచి 613 లక్షల గ్యాలెన్లు రావాలి. కొన్ని వారాలుగా అక్కడి నుంచి 513 లక్షల గ్యాలెన్లు మాత్రమే వస్తున్నాయి. 100 లక్షల గ్యాలెన్లు తక్కువ కావడం వల్ల ఢిల్లీలోని 28 లక్షల మంది తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ’’ అని అతిషి పేర్కొన్నారు.

గతంలో పోలీసు కమిషనర్‌కు లేఖ..

సోనియా విహార్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ నుంచి దక్షిణ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌ లీకేజీకి గురైనట్లు పెట్రోలింగ్ బృందం గుర్తించింది. ఎవరో కావాలని పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారని పేర్కొంటూ అతిషి జూన్ 16న పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. కొన్ని రోజుల పాటు ప్రధాన పైప్‌లైన్‌ల వద్ద పోలీసులను భద్రతగా ఉంచాలని ఆమె కోరారు.

Tags:    

Similar News