వక్ఫ్ సవరణ బిల్లును నితీష్, చంద్రబాబు సమర్థిసారా? వ్యతిరేకిస్తారా?

కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ కూటమికి ప్రధాన భాగస్వామ్యులు జేడీ(యూ), టీడీపీ. ఈ రెండు పార్టీల నేతలు నితీష్,చంద్రబాబు బిల్లు విషయంలో ఎలా స్పందిస్తారో మరి?

By :  Gyan Verma
Update: 2024-11-07 07:08 GMT

పార్లమెంటులో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తుంది. ఇక ఈ పోరు రాష్ట్రాలనూ తాకింది.

వచ్చే నెలలో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) సిద్ధమవుతుండగా.. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వొదని ముస్లిం సంస్థలు బీజేపీ కూటమి భాగస్వామ పార్టీలను కోరుతున్నాయి. కేంద్రానికి సపోర్టు చేయొద్దని జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఆ బిల్లులకు మేం పూర్తిగా వ్యతిరేకం..

జమియత్ ఉలామా-ఇ-హింద్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఫెడరల్‌తో మాట్లాడుతూ..“మేం వక్ఫ్ సవరణ బిల్లు, యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు ప్రణాళికకు పూర్తిగా వ్యతిరేకం. కేంద్రంలో బీజేపీ కూటమికి బలమైన భాగస్వాములు జేడీయూ, టీడీపీ. అందుకే బిల్లులకు మద్దతు ఇవ్వొద్దని ఈ రెండు పార్టీల నేతలను కోరబోతున్నాం. వక్ఫ్ సవరణ బిల్లుకు తాము మద్దతివ్వబోమని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇప్పటికే చెప్పేసింది. ఒకవేళ బిల్లు పాసయితే సంస్థలు, వ్యక్తుల ద్వారా వక్ఫ్ భూమిని లాక్కోవడానికి అనుమతించినట్టేనని రెహ్మన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు సీఎంలకు ఆహ్వానం..

ఈ అంశంపై చర్చించేందుకు ముస్లిం సంస్థలు మూడు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. తొలి సమావేశం ఢిల్లీలో, రెండోది నవంబర్ 24న పాట్నాలో జరగనుంది. పాట్నాలో జరిగే సమావేశానికి హాజరు కావాలని నితీశ్‌కు ఆహ్వానం అందింది. ఇక డిసెంబరులో ఏపీలోని కడపలో మూడో సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరవుతారని రెహ్మాన్ చెప్పారు.

ఎవరి పట్టు వారిది?

శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ సీనియర్ నేతలు భావిస్తుండగా.. బిల్లుపై తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు ఇంకాస్త సమయం కావాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

ప్రశ్నలకు జవాబులేవి?

సీనియర్ కాంగ్రెస్ పార్లమెంటేరియన్, JPC సభ్యుడు డాక్టర్ జావేద్ ఆజాద్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..“మాకు రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది మా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. JPC సభ్యుల రాతపూర్వక ప్రశ్నలకు ఇంకా జవాబులు రావాలి. రెండో అంశం పెద్దగా చర్చ జరగకుండానే బిల్లును ఖరారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలను వినకుండా జేపీసీ నివేదికను సిద్ధం చేస్తే అంతకన్నా దురదృష్టకరం ఇంకొకటి ఉండదు.’’ అన్నారు.

నితీష్ ఎలా స్పందిస్తారో?

బీహార్‌లో మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువ. జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్ 2025లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో JD(U), చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి ముస్లింల మద్దతు తప్పనిసరి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో వక్ఫ్ సవరణ బిల్లు, UCC తప్పక ప్రభావం చూపుతాయని లక్నో విశ్వవిద్యాలయంలో మాజీ ప్రొఫెసర్ డాక్టర్ SK ద్వివేది అంటున్నారు. “ఎన్నికలకు ముందు నితీష్ కుమార్‌కు ముస్లింల మద్దతు కావాల్సిందే. ఇటు లలూ కూడా చాలా ఏళ్ల పాటు ముస్లింల మద్దతుతోనే రాజ్యాధికారం చేపట్టారు.” అని ఆయన చెప్పారు.

నితీష్, బాబు స్టాండేమిటి?

“వక్ఫ్ సవరణ బిల్లు, యూసీసీపై నితీష్ కుమార్ లేదా చంద్రబాబు నాయుడు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఈ ఇద్దరు బీజేపీని వ్యతిరేకిస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీళిద్దరూ ఇప్పటివరకు బీజేపీని ఏ విషయంలోనూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.

Tags:    

Similar News