ఆర్‌సీబీపై క్రిమినల్ కేసు..

ఆమోదం తెలిపిన కర్ణాటక మంత్రివర్గం..పోలీసు అధికారులపై శాఖాపర విచారణ..;

Update: 2025-07-24 12:14 GMT
Click the Play button to listen to article

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుపై క్రిమినల్ కేసు నమోదుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొక్కిసలాటకు దారితీసిన భద్రతా లోపాలు, నిర్లక్ష్యమే కారణమని తేల్చిన కమిషన్ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు ఏం జరిగింది?

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోగా మరో 40 మంది గాయపడ్డ విషయం విదితమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. 32,000 మంది వేల కెపాసిటీ ఉన్న స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. జూన్ 4న జరిగిన విషాదానికి సంబంధించి మైఖేల్ డి కున్హా విచారణ కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా మంత్రివర్గం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశంలో కున్హా కమిషన్ నివేదికపై వివరణాత్మక చర్చ కూడా జరిగింది. పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై శాఖాపర చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News