‘మమత అన్ని చర్యలు తీసుకున్నారు’

కోల్‌కతా ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ నాయకుడు కునాల్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-08-15 12:46 GMT

కోల్‌కతా ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దుర్ఘటనపై సర్వత్రా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ వ్యాఖ్యాలు దుమారం లేపుతున్నాయి. అత్యాచారాలు ఎక్కడైనా జరుగుతాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర రాష్ట్రాల సీఎంల మాదిరిగా కాకుండా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసులో అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నారని కునాల్ చెప్పారు. ‘‘హత్రాస్ ఘటనకు కారకులైన వారిపై బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. కానీ పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమత నిందితుడికి మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. TMC సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు’’ అని ఘోష్ పేర్కొన్నారు.

ఆర్జీ కర్ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించగా ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలు వంటి ప్రాంతాల్లోనే వైద్యులకు రక్షణ లేకపోతే బయట చదువుల కోసం తమ ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎలా పంపుతారని రాహుల్ ప్రశ్నించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయన్నారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఇలాంటి ఘోరమైన నేరాలను అరికట్టడంలో విఫలమవుతుండటం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. మహిళలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించేందుకు దేశవ్యాప్త చర్చ, సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హత్రాస్ నుంచి ఉన్నావో వరకూ, కథువా నుంచి కోల్‌కతా వరకూ మహిళలపై దాడుల ఘటనలు పెరుగుతూ పోతుండటంపై అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని ప్రతి వర్గం సీరియస్‌గా చర్చించి, సమగ్ర చర్యలు తీసుకోవాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News