'మోదినోమిక్స్’ దేశ ఆర్థిక వ్యవస్థకు శాపం..

యూపీఏ హయాంలో పెరిగిన భారత్‌ ఎగుమతుల లాభాలను మీ విధానాలతో విస్మరించడం వల్లే 10 ఏళ్లలో మేకిన్‌ ఇండియా ఘోరంగా విఫలమైంది’’ - ఏఐసీసీ చీఫ్ ఖర్గే

Update: 2024-10-06 12:20 GMT

ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పాత ప్రసంగాలనే మోదీ మళ్లీ మళ్లీ పునరావృతం చేసినా..దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరన్నారు. మేకిన్‌ ఇండియా విఫలమైందన్నారు.

‘‘మోదీ ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయి. పాత ప్రసంగాలను పునరావృతం చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో మీ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు. 2013-14 నుంచి నేటి వరకు గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి. జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్‌ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది’’ అని ఖర్గే ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

‘‘క్రితం ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగాయి. అసంఘటిత రంగాన్ని నాశనం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. యూపీఏ హయాంలో పెరిగిన భారత్‌ ఎగుమతుల లాభాలను మీ విధానాలతో విస్మరించడం వల్లే 10 ఏళ్లలో మేకిన్‌ ఇండియా ఘోరంగా విఫలమైంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూరత్‌లోని వజ్రాల కార్మికుల జీతాలను 30 శాతం వరకు తగ్గించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైమండ్ యూనిట్లు వారానికి నాలుగు రోజులే పనిచేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 60 మందికి పైగా వజ్రాల కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు." అని ఖర్గే అన్నారు.

Tags:    

Similar News