‘‘నో కోల్డ్ వార్..అంతా కూల్..కూల్’’

విపక్షాల తీరుపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, ఆయన డిప్యూటీలు షిండే, పవార్ ఘాటుగా స్పందించారు. మా మధ్య ఏ విభేదాల్లేవని మహాయుతి కూటమి నేతలు క్లారిటీ ఇచ్చారు.;

Update: 2025-03-03 07:34 GMT
Click the Play button to listen to article

శివసేన (Shiv Sena) (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్‌(Sanjay Raut) వ్యాఖ్యలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫిబ్రవరి 22న పుణేలోని కొరేగావ్ పార్క్ హోటల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని రౌత్ ఆరోపించారు. అయితే రౌత్ ఆరోపణలు కేవలం ఊహాగానాలేనని షిండే కొట్టిపడేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు షిండే(Eknath Shinde), అజిత్ పవార్ మాట్లాడారు.

"అంతా కూల్!"..

మహాయుతి పాలక కూటమిలోని పార్టీలయిన బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఐక్యంగా పనిచేస్తున్నాయని ఫడ్నవిస్ (Devendra Fadnavis) స్పష్టం చేశారు. "మా మధ్య ఏ విభేదాలు లేదు. మా గురించి తెలిసిన వాళ్లకు..మా ఐక్యత గురించి కూడా తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు షిండే సీఎం కాగా.. నేను, పవార్ డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు," అని ఫడ్నవిస్ సమాధానమిచ్చారు.

‘‘మేం కేవలం మా కుర్చీలు మార్చుకున్నాం. పవార్ (Ajit Pawar) గారి కుర్చీ మాత్రం ఫిక్స్" అని షిండే అన్నారు. గత ఏడాది ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఈ బడ్జెట్ సమావేశం కొత్త ప్రభుత్వానికి తొలి సమావేశం అని చెప్పారు.

‘‘వాళ్ల తీరు అలా ఉంది..’’

విధానసభ సమావేశానికి ముందురోజు నిర్వహించిన సంప్రదాయ టీ పార్టీలో ప్రతిపక్షం పాల్గొనకపోవడంపై ఫడ్నవిస్ మండిపడ్డారు. ‘‘మేం వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ ఆహ్వానిస్తే హాజరుకావడం లేదు," అని అన్నారు.

ప్రతిపక్షం రాసిన లేఖపై వ్యాఖ్యానిస్తూ.."తొమ్మిది పేజీల లేఖలో తొమ్మిది మంది ప్రతిపక్ష నేతల పేర్లు ఉన్నాయి. అయితే ఏడుగురే సంతకం చేశారు. పత్రికా కథనాల ఆధారంగా లేఖ రాసుకొచ్చారు. ప్రభుత్వ వివరణను చదివితే వారు అరకొర పేజీ కూడా రాయలేరు" అని అన్నారు ఫడ్నవిస్. "మార్చి 10న సంతులిత బడ్జెట్ ప్రవేశపెడతాం. ఆర్థిక నియంత్రణ పాటిస్తాం. ఫ్లాగ్‌షిప్ పథకాలు కొనసాగుతాయి. అర్హత లేని లబ్ధిదారులను మాత్రమే తొలగిస్తాం" అని పేర్కొన్నారు.

‘‘దోషులను శిక్షిస్తాం..’’

కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెపై వేధింపులను దురదృష్టకరంగా అభివర్ణించిన ఫడ్నవీస్.. దోషులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఎన్సీపీ మంత్రులు మాణిక్రావ్ కొకటే, ధనంజయ్ ముండే రాజీనామాలపై ప్రతిపక్ష డిమాండ్‌పై స్పందిస్తూ.. "కొకటే విషయంలో కోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ముండేపై ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చాం," అని చెప్పారు. కొకటేకు ఇటీవల ఫోర్జరీ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే నాసిక్ సెషన్స్ కోర్టు ఆ శిక్షపై మార్చి 5న తీర్పు వెల్లడించనుంది. బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్యకేసులో ముండే అనుచరుడు వాల్మీక్ కరాడ్ అరెస్టు అయినప్పటి నుంచి ప్రతిపక్షం ఆయనను టార్గెట్ చేసింది.

Tags:    

Similar News