'డిజిటల్ అరెస్ట్' కావొద్దంటున్న I4C..

పెరిగిపోతోన్న 'డిజిటల్ అరెస్ట్' నేరాల దృష్ట్యా.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఒక సలహా ఇస్తోంది.

Update: 2024-10-06 13:41 GMT

టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. మరోవైపు సైబర్ క్రైం అదే స్థాయిలో పెరిగిపోతుంది. సైబర్ కేటుగాళ్లు కష్టపడి దాచుకున్న డబ్బును క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లను వివిధ రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేసినా ఆ నేరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెరిగిపోతోన్న 'డిజిటల్ అరెస్ట్' నేరాల దృష్ట్యా.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఒక సలహా ఇస్తోంది. అపరిచితుల కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. ‘‘మేం పోలీసు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. డ్రగ్స్, ఇతర నిషేధిత వస్తువులు మీ పేరుతో పార్సిల్‌లో వచ్చిందన్న సమాచారం మాకు వచ్చింది.’’ అని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతారు.

అలాంటప్పుడు ఏం చేయాలి..I4C ఏం చెబుతుంది?

‘‘అలాంటి కాల్స్‌కు భయపడి.. అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వకండి. నేరారోపణకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి. డబ్బు అడిగినే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ తరహా కాల్స్ వస్తే సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ఫోన్ చేయండి. www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చాలి’’ అని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చెబుతుంది.

Tags:    

Similar News