'స్పిట్ జిహాద్'కు పాల్పడితే రూ. లక్ష ఫైన్..

‘థూక్ జిహాద్‌’ ఘటనల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీవ్రమైన సమస్యగా భావించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ చర్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

Update: 2024-10-17 07:18 GMT

ఒకడు చపాతీలు చేస్తూ అందులో ఉమ్ముతాడు. మరొకడు మూత్రం కలిపిన జ్యూస్‌ను సర్వ్ చేస్తాడు. ‘థూక్ జిహాద్‌’గా పిలిచే ఈ తరహా ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దీన్ని తీవ్రమైన సమస్యగా భావించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇలాంటి చర్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

తమ ప్రభుత్వం ఆహార భద్రత, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆరోగ్య మంత్రి ధన్‌సింగ్ రావత్ చెబుతూ.. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడే వారిని ఉపక్షేంచేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినవ్ కుమార్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అవి అమలయ్యేలా చూడారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. హోటళ్లు, దాబాల్లో ఆహార పదార్థాలు తయారీ చేసే గదిలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రంలోని హోటల్, దాబా యజమానులకు సూచించారు. ‘థూక్ జిహాద్‌’కు పాల్పడిన వారికి రూ. 1 లక్ష ఫైన్ కూడా విధిస్తామని హెచ్చరించారు. పెట్రోలింగ్ సమయంలో హోటళ్లను తనిఖీ చేయడం, అవసరమైతే వాటి తనిఖీకి ఫుడ్ సెఫ్టీ అధికారులను సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఇటీవలి అరెస్టులతో..

ఉమ్మేసిన ఫ్రూట్ జ్యూస్‌ను టూరిస్టులకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల ముస్సోరీలో అరెస్టు చేశారు. ఒక వంటవాడు రోటీల కోసం పిండిని తయారు చేస్తున్నప్పుడు ఉమ్మిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యదర్శి, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఆర్ రాజేష్ కుమార్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని జారీ చేశారు. ఈ తరహా ఘటనల నివారణకు పొరుగున ఉన్న ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం త్వరలో రెండు ఆర్డినెన్స్ అమల్లోకి తేనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News