దళపతి రాజకీయ ప్రవేశం మా కూటమికి లాభమే: కాంగ్రెస్
కోలీవుడ్ నటుడు విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ వల్ల ఇండి కూటమి లాభమే అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
By : The Federal
Update: 2024-11-02 11:55 GMT
కోలీవుడ్ లో అగ్రనటుడు, దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావడంపై మెల్లగా పార్టీల ప్రతిస్పందన మొదలైంది. ఇందులో మొదటగా జాతీయ పార్టీ కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ వల్ల ఇండి కూటమికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది. విజయ్ గత శనివారం (అక్టోబర్ 27) తన తొలి రాజకీయ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ తన ఎజెండాను వివరించారు.
విజయ్ ప్రసంగంపై స్పందిస్తూ.. దళపతి ప్రవేశం రాజకీయ రంగంలో ఏదైనా మార్పును కలిగిస్తుందా అని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) పేర్కొంది. ఇది మారదు, అయితే ఇది ఇండి కూటమికి "అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది". అని భావించింది.
"ఇది మారదు, ఇండి కూటమి విజయానికి ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం ఇండి కూటమికి ఎలా ఉపయోగపడుతుందనే వివరాల జోలికి సెల్వపెరుంతగై వెళ్లలేదు.
విజయ్ చేసిన అధికార భాగస్వామ్య ఆలోచన గురించి, అది అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ప్రభావం చూపుతుందా అని ప్రశ్నించినప్పుడు.. “ఇది ఊగిసలాడుతున్న వారికి ఆశ కలిగించి ఉండవచ్చు. కానీ ఇండి కూటమి బలంగానే ఉందన్నారు.
“కాంగ్రెస్ 2004 - 2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా, మేము అధికారాన్ని పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తాము. అయితే అధికార భాగస్వామ్యానికి సంబంధించి జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని వికిరవండి గ్రామంలో TVK మొదటి రాష్ట్ర సదస్సులో అశేష ప్రేక్షకుల ముందు మాట్లాడిన విజయ్, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. వేర్పాటువాదులకు, అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు.