బడ్జెట్‌ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే నిరసనలు

బడ్జెట్ (2024-25) కేటాయింపులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ శనివారం తమిళనాడు అధికార డిఎంకె రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

Update: 2024-07-27 12:28 GMT

బడ్జెట్ (2024-25) కేటాయింపులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ శనివారం తమిళనాడు అధికార డిఎంకె రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ నిరసనకు ఎంపీలు, పార్టీ నాయకులు నాయకత్వం వహించారు. మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టులకు తమిళనాడుకు నిధులు కేటాయించకపోవడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు నాయకత్వం వహించిన ఎంపీల్లో టీఆర్‌ బాలు, కనిజ్‌మొళి, దయానిధి మారన్‌ ఉన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొన్ని గంటల తర్వాత.. బడ్జెట్‌లో తమిళనాడును పూర్తిగా విస్మరించారని స్టాలిన్ అన్నారు. ఈ వివక్షను ఖండిస్తూ జూలై 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

బడ్జెట్‌ 'పెద్ద నిరాశ'ను మిగిల్చిందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడును కేంద్రం పూర్తిగా విస్మరించినందున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సముచితమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News