రూ.13వేల కోట్ల పరిశ్రమతో 14వేల మందికి ఉపాధి..

తమిళనాడు ప్రభుత్వం కొత్తగా మరో 14 పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.38,698 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమల వల్ల 46,931 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

Update: 2024-10-09 07:04 GMT

తమిళనాడు ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో 14 పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.38,698 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమల వల్ల 46,931 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

తైవాన్‌ ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌కు చెందిన యుజాన్ టెక్నాలజీ రాష్ట్రంలో రూ. 13వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు కూడా తమిళనాడు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో మంగళవారం చెన్నై సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 14వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. చెన్నైకి సమీపంలోని ఒరగడమ్‌లోని ESR ఇండస్ట్రియల్ పార్క్‌లో యుజాన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. స్మార్ట్‌ఫోన్ల విడిభాగాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రధానంగా Apple ఫోన్ విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడటాన్ని ఈ పరిశ్రమ తగ్గిస్తుంది.

14% ఐఫోన్‌ల అసెంబ్లింగ్ మనదేశంలోనే..

భారత దేశంలో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌ ద్వారా ఐఫోన్‌ల అసెంబ్లింగ్ జరుగుతుంది. ఈ ఏడాది జూలైలో పార్లమెంట్‌లో సమర్పించిన ఎకనామిక్ సర్వే 2024 ప్రకారం.. దేశంలో 14 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లలో 14 శాతం ఫోన్లు ఇక్కడ అసెంబుల్ చేసినవేనని పేర్కొంది.

రాష్ట్రంలో మరికొన్ని పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు..

రాణిపేట జిల్లాలో టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ రూ.9వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమలో 5వేల మందికి, కాంచీపురం జిల్లా, తూత్తుకుడి, విరుదునగర్‌, తిరునెల్వేలి, రామనాథపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో పీఎస్‌జీ అనుబంధ సంస్థ లీఫ్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10,375 కోట్ల పెట్టుబడితో 3వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

అరియలూర్‌ జిల్లాలో తైవాన్‌ దేశానికి చెందిన టీన్‌ షూస్‌ అనుబంధ సంస్థ, ఫ్రీ ట్రెండ్‌ ఇండస్ట్రియల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1000 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి, కాంచీపురం జిల్లాలో కేన్స్‌ సర్క్యూట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున రూ.1,395 కోట్ల పెట్టుబడితో 1033 మందికి, అసెంట్‌ సర్క్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.612.60 కోట్లతో 1200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Tags:    

Similar News