ఆహ్వానం లేకుండా ఢిల్లీ వెళ్లను: సిద్ధరామయ్య

పార్టీ కార్యక్రమాల కోసం రాజధానికి వెళ్తున్నా అన్న డీకేఎస్

Update: 2025-12-04 06:46 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లిన అంశంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనకు ఢిల్లీ వెళ్లే ఆహ్వానం రాలేదని, అధికారికంగా ఆహ్వానం లభిస్తేనే వెళ్తానని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రత్యేక విమానంలో హస్తీనకు వెళ్లారు. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనే అంశంతో పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమం కోసం రాజధానికి బయల్దేరారు.

అదే సమయంలో సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు, మహ్మాత్మా గాంధీతో సమావేశం అయి వంద సంవత్సరాలు పూర్తి అయినందున ప్రభుత్వం ప్రత్యేకంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక కోసం సిద్ధరామయ్య మంగళూర్ చేరుకున్నారు.

అల్ఫాహార సమావేశాలు..
రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి వస్తున్న ఊహగానాలను అరికట్టడానికి ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఇటీవల బెంగళూర్ లోని వారి నివాసాలలో ఒకరికొకరు అల్ఫాహార దౌత్యం నెరిపారు.
కాంగ్రెస్ నిర్వహించే ఈ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ కూడా మంగళూర్ కార్యక్రమానికి హజరయ్యారు. తరువాత సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్ కలిసి భోజనం చేశారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.
ఆహ్వానం లేకుండా తాను ఢిల్లీ వెళ్లనని అన్నారు. శివకుమార్ ఢిల్లీ వెళ్తున్నారని విలేకరులు అడగగా, ‘‘అతన్ని వెళ్లనివ్వండి, ఎవరైనా అతడిని నో చెప్పారా?’’ అని ఆయన ప్రశ్నించగా, మరోసారి విలేకరులు ఇదే ప్రశ్న వేయగా.. ‘‘నేను ఆహ్వానం వస్తేనే ఢిల్లీ వెళ్తాను. నన్ను ఎవరూ ఆహ్వానించలేదు. కాబట్టి నేను వెళ్లడం లేదు’’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి పార్టీ హైకమాండ్ నుంచి ఏదైనా ఆదేశాలు ఉంటే, దానిని వేణుగోపాల్ ద్వారా తెలియజేస్తారని సిద్ధరామయ్య అన్నారు.
ఓట్ చోరీ కార్యక్రమం..
డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓటు చోరి ప్రచారం పై నిర్వహించబోతున్న కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగే చర్చ ప్రణాళికలను కూడా డీకే ప్రస్తావించారు.
‘‘ఢిల్లీలో ఈ నెల 14న ఓట్ చోరి కార్యక్రమం ఉంది. కాబట్టి మేము ప్రతి జిల్లా నుంచి కనీసం 300 మందిని ఢిల్లీని తీసుకెళ్తాము. మేము పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. వారిని ఢిల్లీ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని నేను జిల్లా యూనిట్లకు చెప్పాను’’ అని శివకుమార్ ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో అన్నారు.
కేసీ వేణుగోపాల్ సీఎం సిద్ధరామయ్యను కలవడంపై కూడా డీకే స్పందించారు. ‘‘సీఎం.. వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలవడంలో తప్పేముంది?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
వేణుగోపాల్ వచ్చిన తరువాత మంగళూర్ లో కొంతమంది తన మద్దతుదారులు డీకే సీఎం అంటూ చేసిన నినాదాలపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘ఇది సాధారణం. కొంతమంది మోదీ- మోదీ అంటారు, ఇంకొందరు డీకే - డీకే అంటారు. మరికొందరూ రాహుల్- రాహుల్, కొందరూ సిద్ధూ- సిద్ధూ అని నినాదాలు చేస్తారు. అందులో తప్పులేదు. ప్రజలు తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. మనం దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి’’ అని డీకే అన్నారు.
Tags:    

Similar News