Tamilnadu | హౌసింగ్ స్కీమ్ కోసం అదనంగా రూ. 400 కోట్లు
‘కళైజ్ఞరిన్ కనవు ఇల్లం’ కింద పనులు వేగవంతం చేసేందుకు మరో రూ.400 కోట్లు విడుదల చేశామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ప్రకటించారు.
తమిళనాడు రాష్ట్ర గృహ నిర్మాణ పథకం ‘కళైజ్ఞరిన్ కనవు ఇల్లం’ కింద పనులు వేగవంతం చేసేందుకు మరో రూ.400 కోట్లు విడుదల చేశామని, ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ప్రకటించారు. అదనపు నిధుల విడుదలతో కలిపి మొత్తం రూ.1,451 కోట్లు లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 360 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్ లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకు రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా డీబీటీ కింద జమ చేస్తారు. ఇప్పటివరకు రూ.860.31 కోట్లు లబ్ధిదారులకు అందజేయగా, రూ.135.30 కోట్లు నిర్మాణ సామగ్రికి చెల్లించినట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే 2024-25 సంవత్సరానికి 'కళైజ్ఞరిన్ కనవు ఇల్లుం’ కింద లక్ష కొత్త కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి రూ.3.50 చొప్పున రూ.3,500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో ఇంటికి లక్ష చొప్పున కేటాయించారు. పనులు ఇంకా జరుగుతున్నాయి. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల గుడిసెలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. వాటి స్థానంలో కాంక్రీట్ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం 2030లో 8 లక్షల కొత్త ఇళ్లను ప్రకటించింది.
పథకం గురించి క్లుప్తంగా..
గుడిసెవాసులకు శాశ్వత గృహాల నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం 2010లో 'కలైంజర్ వీడు వళంగుం తిట్టం' ప్రారంభించింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో గుడిసెల స్థానంలో సురక్షితమైన, శాశ్వతమైన కాంక్రీట్ ఇళ్లను నిర్మించిన ఈ పథకం లక్ష్యం. 2030 నాటికి 'హట్-ఫ్రీ తమిళనాడు' దిశగా స్టాలిన్ ప్రభుత్వం పనిచేస్తుంది. 6 సంవత్సరాల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది లక్షల కాంక్రీట్ ఇళ్లను నిర్మించనున్నారు.
ఈ పథకం కింద వంటగదితో కలితో 360 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తారు. ఇందులో 300 చ.అడుగులు RCC రూఫింగ్ ఉంటుంది. మిగిలిన 60 చ.అడుగులు మండే స్వభావం లేని మెటీరియల్‌తో పైకప్పు నిర్మిస్తారు.