మేడారం జాతర కోసం 150 కోట్లు

ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ;

Update: 2025-08-20 11:18 GMT

వచ్చే సంవత్సరం జనవరిలో జరుగనున్న మేడారం మహా జాతర నిర్వహణ, మేడారం లో శాశ్వత నిర్మాణాల పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది.మునుపెన్నడూ లేని విధంగా మేడారం మహా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు 150 కోట్లు మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర ఖ్యాతి పొందింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతరను అత్యంత భక్తి శ్రద్దలతో కన్నుల పండుగగా జరుపుకుంటారు. సమ్మక్క సారక్కను దర్శనం చేసుకోవడానికి కోట్లాది భక్తుజనం దేశ నలుమూలనుంచి మేడారం జాతరకు తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మేడారంలో ఇప్పటివరకు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు.మేడారం జాతరకు వెళ్ళిన భక్తులు అక్కడ చాలా రకాల ఇబ్బందులను పడుతున్నట్టు భక్తుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతర కోసం ఏకంగా రూ. 150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు ఈ జాతర జరగనుంది. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టి అక్కడ అభివృద్ధి పనులను చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వినియోగించుకొని మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News