Kavitha |కవిత చేజారిపోయిన సింగరేణి
బుధవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(TGBGKS) గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు తీసుకున్నారు;
చాలా సైలెంటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన చెల్లెలు కల్వకుంట్ల కవితకు షాకిచ్చారు. బుధవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(TGBGKS) గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు పదేళ్ళుగా ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కవిత(Kavitha) ఉంటున్నారు. ఈమధ్యనే గౌరవ అధ్యక్షురాలి హోదాలో కవిత సంఘం నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత సంఘం బలోపేతానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి(Singareni)లోని సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణను రెడీచేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.
ఇంతలోనే కవిత ప్లేసులో కొప్పుల గౌరవఅద్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం గమనార్హం. నిజానికి కొప్పులను సంఘం గౌరవఅధ్యక్షుడిగా నియమించినట్లు కేటీఆర్ దాదాపు నెలరోజుల క్రితం పార్టీ ఆఫీసులోనే ప్రకటించారు. ఆ తర్వాత ఈవిషయమై ఎలాండి డెవలప్మెంట్ జరగలేదు. ఇదేసమయంలో సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవితే సంఘం నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టే కొప్పులను నియమిస్తు కేటీఆర్ చేసిన ప్రకటనపై అందరిలోను అయోమయం ఉండిపోయింది. అలాంటిది బుధవారం జరిగినసమావేశంలో కొప్పులను సంఘం కార్యవర్గ సమావేశమే గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటంతో క్లారిటి వచ్చేసింది. కవితను గౌరవాధ్యక్షురాలిగా కేటీఆర్ చాలా సైలెంటుగా దెబ్బకొట్టినట్లు అర్ధమవుతోంది.
దాదాపు మూడునెలలుగా అన్నా-చెల్లెళ్ళ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కవిత అమెరికాలో ఉన్నపుడు ఆమె తండ్రి, పార్టీఅధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవ్వటంతో ఇద్దరిమధ్యా విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అప్పటినుండి ఇద్దరి మధ్యా పెద్ద వారే నడుస్తోంది. కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించేదిలేదని కవిత చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది. ఈనేపధ్యంలోనే పార్టీనుండి కవితకు ఎలాంటి సహకారం అందటంలేదు. తనకు పార్టీనేతలు మద్దతుగా నిలవకపోవటంలో కూడా ఆమె కేటీఆర్ నే తప్పుపడుతున్నారు. పార్టీలో తన విషయంలో జరుగుతున్న పరిణామాలను గమినించిన కవిత ముందుజాగ్రత్తగా జాగృతి సంస్ధను యాక్టివేట్ చేశారు. అలాగే సింగరేణి సంఘాన్ని కూడా బలోపేతం చేయటానికి తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాంటిది ఇపుడు కవిత ప్లేసులో కొప్పుల గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవటంతో సింగరేణి సంఘం కవిత చేజారిపోయినట్లు అనుకోవాలి. తాజా డెవలప్మెంట్లపై కవిత ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.