కెసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించింది

జవహార్ ఎత్తి పోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు;

Update: 2025-08-10 13:20 GMT

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కమీషన్ల కోసం కెసీఆర్ ప్రభుత్వం కక్కుర్తి పడిందన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలో 630 కోట్లతో నిర్మించతల పెట్టిన జవహార్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. సన్నబియ్యం ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 12 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దకాలంగా బిఆర్ ఎస్ ప్రభుత్వం జవహార్ ఎత్తి పోతల పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. నాగార్జునాసాగర్ చివరి ఆయుకట్ట వరకు నీళ్లు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. ఈ దిశగా డిప్యూటి సీఎం భట్టివిక్రమార్క కృషి చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయించినట్టు పొంగులేటి చెప్పారు. రైతు భరోసా క్రింద రైతులకు ప్రతీనెలా ఠంచనుగా డబ్బులు పడుతున్నాయన్నారు. నాగార్జునా సాగర్ నీళ్లు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రపాలెం మండలాలలకు సాగునీరు, త్రాగు నీరు అందిస్తున్నట్టు చెప్పారు. ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ది పేరిట రాష్ట్రాన్ని రేవంత్ సర్కారు పరుగులు పెట్టిస్తుందన్నారు.
జవహార్ ఎత్తిపోతల పథకం
నాగార్జునసాగర్‌ లెప్ట్ కెనాల్ నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టే జవహర్‌ ఎత్తిపోతల పథకం.
ఈ పథకానికి గత నెలలో టెండర్లకు కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ) ఆమోదం తెలిపింది. ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సీవోటీ సమావేశంలో ఈ ఎత్తిపోతల టెండర్లపై చర్చించి ఆమోదం తెలిపారు.రూ.456.49 కోట్ల ఎస్టిమేషన్ తో టెండర్లు పిలువగా... 4.85శాతం హెచ్చింపుతో పీవీఆర్‌ ప్రాజెక్ట్స్‌ (80 శాతం) - ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(20 శాతం) జాయింట్‌ వెంచర్‌ టెండర్‌ వేసింది. ఈ సంస్థకు టెండర్‌ కట్టబెట్టడానికి సీవోటీ ఆమోదం తెలపడంతో సంబంధిత ప్రాజెక్టు ఎస్‌ఈ వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నారు.
Tags:    

Similar News