చత్తీస్ ఘడ్ లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
వీరిపై రూ 37 లక్షల రివార్డు;
By : B Srinivasa Chary
Update: 2025-07-11 12:30 GMT
చత్తీస్ ఘడ్ బస్తర్ లో 22 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ ప్రకటించిన నేపధ్యంలో మావోయిస్టుల పై భధ్రతా బలగాల ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టడంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. వచ్చే ఏడాది మావోయిస్టు రహిత దేశంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన వారిలో 14 మావోయిస్టులు పురుషులైతే 8 మంది మహిళా మావోయిస్టులున్నారు. నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ ప్రాంతంలో ఎస్పీ రాబిన్ సన్ గుడియా ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కుతుల్ ఏరియా కమిటీ కమాండర్ సుఖ్ లాల్ కూడా ఉన్నారు. లొంగిపోయిన 22 మావోలపై 37 లక్షల రివార్డు ఉంది.