మున్సిపాలిటీల్లో విలీనమైన ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది.

Update: 2024-09-03 15:11 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త విద్య కమిషన్ ని ఏర్పాటు చేసింది. అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.

మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల లిస్ట్ 

పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు విలీనం

శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం

నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ

తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ

మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి

నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు

పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం

ఘట్కేసర్ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో.. మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు

తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం

విద్యాకమిషన్ ఏర్పాటు...

తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ రూపొందించడం కోసం విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది. చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు కమిటీలో ఉండనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. త్వరలోనే చైర్మన్‌ను, కమిషన్‌ సభ్యులను నియమించనున్నట్టు తెలిపింది. 

Tags:    

Similar News