69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఖైరతాబాద్ లో
తమిళనాడు, ఒరిస్సా కళాకారుల చేత తుదిమెరుగులు దిద్దుకుంటోన్న మట్టిగణపతి;
భారత జాతీయోద్యమ పితామహుడు బాల గంగాధర్ తిలక్ ‘‘ స్వరాజ్యం నా జన్మహక్కు నేను దానిని సాధిస్తాను’’ అనే నినాదం ప్రజలను జాతీయోద్యమంలో పాల్గొనెలా చేసింది. ఆయన స్పూర్తితో 1954 నుంచి ఖైరతాబాద్ గణ నాథుడు ఒక్క అడుగుతో ప్రారంభమైంది. హైదరాబాద్ కు చెందిన సింగరి శంకరయ్య ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడు 70వ వసంతంలో చేరుకుంది. 69 ఫీట్లతో మట్టి గణనాథుడిని తమిళనాడు, ఒరిస్సా కళాకారులు తయరుచేస్తున్నారు. విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ విగ్రహం సైజు మరెక్కడా లేదు ఆ మాటకొస్తే భారత దేశంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అత్యంత ఎత్తైన విగ్రహంగా ప్రతీ సంవత్సరం చరిత్ర పుటల్లో ఎక్కుతూనే ఉంది. కోవిడ్ మహమ్మారి రావడంతో ఖైరతాబాద్ గణనాథుడి పరిమాణం మారిపోయింది. దేశ నలుమూలల నుంచి ఖైరతాబాద్ గణ నాధుడిని చూడటానికి వస్తుంటారు కాబట్టి కోవిడ్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆ యేడు మట్టిగణపతిని తయారు చేయడమే గాక విగ్రహం సైజును తొమ్మిది అడుగులకు కుదించారు.అప్పట్నుంచి ఖైరతాబాద్ గణ నాథుడిని మట్టితో తయారు చేస్తున్నారు.
ఈ సంవత్సరం స్వామి వారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీజగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీసమేత హయగ్రీవ స్వామి. ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా రూపకల్పన చేశారు.
దేశం దృష్టిని ఆకర్షిస్తోంది
"గణేష్ బప్పా మోరియా" అనేది గణేష్ నవ రాత్రుల్లో మర్మోగే నినాదం. హైద్రాబాద్ పురవీధుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తన పరిమాణంతో దేశం దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.
1954లో కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో గణేష్ విగ్రహాన్ని తయారుచేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత పిజెఆర్ నేతృత్వంలో ప్రతీ సంవత్సరం విగ్రహంసైజును పెంచుతూ వెళ్లారు. 2014 తర్వాత విగ్రహం సైజును తగ్గిస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి వచ్చే వరకు తగ్గిస్తూ వచ్చిన నిర్వాహకులు కోవిడ్ తర్వాత మళ్లీ సైజును పెంచుతూ పోయారు. ప్రస్తుతం 69 ఫీట్లతో ఖైరతాబాద్ గణ నాధుడు మరో రికార్డును స్వంతం చేసుకుంది.
వర్షం కురిసినా విగ్రహం చెక్కుచెదరదు
అంతే కాదు తమిళనాడు, ఒరిస్సా కళాకారులు ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడికి 69 ఏళ్లు పూర్తయిన సందర్బంగా 69 ఫీట్లతో మట్టి గణపతిని తయారుచేయడం ప్రాధాన్యత చోటు చేసుకుంది.
గణపతి పొట్ట క్రింది భాగం ఒరిస్సా కళాకారులు, పొట్టపై భాగం తమిళనాడు కళాకారులు తయారుచేస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాలు ముగియగానే 11వ రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని చోట్ల నవరాత్రి ఉత్సవాలు జరిగితే ఖైరతాబాద్ లో మాత్రం ఎనిమిదోరోజు ఉత్సవాలు ముగుస్తాయి. అత్యంత భారీ విగ్రహం కావడంతో నిమజ్జనం రోజు భక్తులు ఇక్కడికి చేరుకోకుండా నిర్వాహకులు ఈ జాగ్రత్త తీసుకున్నారు
హుస్సేన్ సాగర్ లో విగ్రహం నిమజ్జనం చేసే సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ మట్టిగణపతి నీటిలో కరగకపోవడమే ఈ యేడు ప్రత్యేకత అని గణేష్ ఉత్సవ్ కమిటీ నేతలు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ అనేదిప్రతి సంవత్సరం ఖైరతాబాద్‌లో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిర్వహించే సంస్థ. ఈ కమిటీకి సందీప్ రాజ్ కన్వీనర్‌గా, సింగరి రాజ్ కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కర్ర పూజతో విగ్రహ నిర్మాణ పనులు మొదలుపెడతారు, విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది భక్తులు సందర్శించి, చివరికి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు.
ఖైరతాబాద్ గణనాథుడి తయారీ ప్రక్రియను ఆరు నెలల ముందే ప్రారంభించినట్టు తమిళనాడు శిల్పి చినస్వామి రాజేంద్రన్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవరాత్రుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.