రెండో భార్యను చంపి శవం ఫోటోలు మొదటి భార్యకు ...

చేవెళ్ల పోలీసుల ఎదుట లొంగిపోయిన జంగయ్య

Update: 2025-10-08 08:43 GMT

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణం జరిగింది. వెంకన్నగూడకు చెందిన వానరాశి జంగయ్య(33) కు ఇద్దరు భార్యలున్నారు. హైదరాబాద్ లో డ్రైవింగ్ చేసుకునే జంగయ్య 15 ఏళ్ల క్రితం రజిత (30)ను రెండో వివాహం చేసుకున్నాడు.జంగయ్యతో విభేధాలు రావడంతో రజిత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది. అప్పట్నుంచి పటాన్ చెరు రామచంద్రాపురంలో మొదటి భార్య దగ్గరే జంగయ్య నివాసం ఉంటున్నాడు.

మొదటి భార్య దగ్గర ఉన్నప్పటికీ జంగయ్యకు రెండో భార్య మీద మోజు తగ్గలేదు.కనిపించకుండా పోయిన రెండో భార్యను జంగయ్య వెతకడం ఆపలేదు. సోమవారం రజితను పట్టుకుని చేవెళ్ల వెంకన్నగూడకు తీసుకొచ్చాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ పంచాయితీలో రజిత.. భర్త దగ్గర ఉండటానికి అస్సలు ఇష్టపడలేదు.

రజితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  రజితను మంగళవారం జంగయ్య ఇంటికి తీసుకెళ్లి చున్నీతో మెడ బిగించి హత్య చేశాడు.చావలేదనే అనుమానంతో బండరాయితో చాతి మీద బలంగా కొట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

లొంగిపోయిన నిందితుడు

చనిపోయినట్లు నిర్దారణ అయిన తర్వాత రజిత ఫోటోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. రెండో భార్యను హత్య చేసిన అనంతరం జంగయ్య గ్రామ సర్పంచ్ కు హత్య చేసిన విషయం చేరవేశాడు. అనంతరం చేవెళ్ల పోలీసులకు లొంగిపోయాడు. మద్యం మత్తులో రజితను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. రజిత మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News