జనగామ సామూహిక రేప్ కేసులో నిందితుల రిమాండ్

యువతి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి;

Update: 2025-08-14 11:05 GMT

స్నేహం పేరిట జనగామకు చెందిన యువతిని పదిమంది సామూహికంగా రేప్ చేసిన ఘటనలో నిందితులను పోలీసులు రిమాండ్ కు పంపారు. గత జూన్ నెలలో నిందితులలో ఒకరైన మహమ్మద్ ఓవైసీ యువతి(18)ని ఫ్రెండ్ షిప్ ముసుగులో మాయమాటలు చెప్పి ఆ యువతిని వశపరచుకున్నాడు. జనగామ, సూర్యపేట రోడ్డులో గల ‘‘టి వరల్డ్’’ వెనక ఉన్న రూముకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులను రప్పించుకుని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. జనగామకు చెందిన ముత్యాల పవన్‌కుమార్‌, బొద్దుల శివకుమార్‌, అబ్దుల్‌ ఖయ్యూం, పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్‌రెడ్డి, గుండ సాయిచరణ్‌రెడ్డి, ఓరుగంటి సాయిరాం, నెల్లుట్లకు చెందిన నూకల రవి, పసరమడ్లకు చెందిన జెట్టి సంజయ్‌ రేప్ చేసిన వారిలో ఉన్నారు. బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాధిత యువతికి పరిచయమైన యువకుడు స్నేహం పేరిట గోవా పర్యటనకు తీసుకెళ్లి పలు మార్లు రేప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు జనగామ రోడ్డులో ఉన్నారన్న పక్కా సమాచారంతో జనగామ ఎఎస్పీ తన టీంతో కల్సి మెరుపు దాడి చేసారు. నిందితులందరూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. నిందితులను ఒకేసారి అరెస్ట్ చేసి కటకటాలకు పంపినట్టు జనగామ ఎఎస్పీ తెలిపారు.

గోవాకు తీసుకెళ్లి మహమ్మద్ ఓవైసీ తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు తన చిన్నమ్మకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరూ అవివాహితులే. వీళ్లంతా జనగామ పట్టణానికి చెందిన వారే. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ నిందితులు గతంలో అనేక నేరాల్లో నిందితులుగా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మహమ్మద్ ఓవైసీ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ‘‘స్నేహం పేరిట యువతులను మోసం చేస్తున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైందని, అటువంటి వారితో అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలి’’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News