సినీనటి కస్తూరి హైదరాబాద్‌లో అరెస్ట్

తెలుగు వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశాయి. కస్తూరి ముందస్తు బెయిలు పిటిషన్ కోర్టు కొట్టివేసింది.

Update: 2024-11-16 15:26 GMT

ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో ఈ నెల 3వతేదీన జరిగిన ధర్నా కార్యక్రమంలో సినీనటి కస్తూరి తెలుగువారి పట్ల వివాదాస్పద, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

- ‘‘300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు తమది తమిళ జాతి అంటున్నారని, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు?’’అని కస్తూ ద్రవిడ సిద్ధాంత వాదులపై మండిపడ్డారు.
- ఈ వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు చెప్పినా పోలీసులు కేసులు నమోదు చేశారు.
- దీనిపై పలు తెలుగు సంఘాల ప్రతినిధులు కస్తూరి వ్యాఖ్యలను ఖండించడంతోపాటు ఆమెపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టారు. దీంతో కస్తూరి ముందస్తు బెయిలు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
- తెలుగువారిని కించపర్చేలా మాట్లాడిన కస్తూరిని అరెస్టు చేయాలని ద్రావిడ దేశం వ్యవస్థాపకులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. కస్తూరి గతంలో కరుణానిధిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కస్తూరి చిత్రపటాలను కార్యకర్తలు దహనం చేశారు. సినిమాలతోపాటు గృహలక్ష్మీ సీరియల్ లో నటించిన కస్తూరి అరెస్ట్ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది.
కస్తూరి ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News