తెలంగాణలో వచ్చే రెండు రో జుల పాటు వర్షాలు
గురు, శుక్రవారాల్లో;
తెలంగాణకు భారీ వర్ష సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలుకురిసే అవకాశముందని ఒక ప్రకటనలో తెలిపింది. రేపు అంటే గురువారం సూర్యపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, శుక్రవారం వరంగల్, హన్మకోట, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాన వానలు దంచి కురుస్తుంటే... తెలంగాణలో వర్షాలు అనుకున్న స్థాయిలో పడటం లేదు.తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలపడనున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపుల వర్షాలుకురుస్తాయి. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలోనే గురువారం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.