శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..
శాంతి భద్రత విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.;
భారత్, పాక్ ఉద్రిక్తల నడుప శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ బెదిరింపు వచ్చిన వెంటనే భద్రతా సిబ్బంది అలెర్ట్ అయింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్‌పోర్ట్ అంతటా తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై కూడా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టారు. దీంతో పాటుగా శంషాబాద్ విమానాశ్రయం దగ్గర భద్రతను అధికం చేశారు. 24 గంటల పాటు భార భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. స్థానిక శాంతి భద్రత విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే పాకిస్థాన్‌తో సరిహద్దులో నెలకొన్ని పరిస్థితుల్లో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలించింది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో కూడా భద్రతను పెంచారు అధికారులు. ఈ క్రమంలోనే ప్రయాణికులు కూడా మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు.