తెలంగాణ నలుమూలల నుంచి కదిలిన గులాబీ దండు
తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి గులాబీ దండు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు కదిలింది. గులాబీ రంగు జెండాలు రెపరెపలతో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.;
By : The Federal
Update: 2025-04-27 10:20 GMT
హన్మకొండ మండలం ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు గులాబీ జెండాలు పట్టుకొని తరలివచ్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన కార్యకర్తలతో కలిసి బస్సు టాప్ పై నిలబడి సభకు వచ్చారు.
- గులాబీ జెండాల రెపరెపలతో గులాబీ రంగు అంబాసిడరు కార్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
వరంగల్లు దారిలో గులాబీ జోష్ 💥
— BRS Party (@BRSparty) April 27, 2025
ఉరకలేస్తూ, ఉత్సాహంగా గులాబీ జాతరకు గులాబీ దండు.#BRSat25 #BRSParty pic.twitter.com/EOLF9m6LWj
- శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద తన పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాస్ సాంగ్ కు డాన్స్ చేశారు. మల్లారెడ్డి చేసిన డాన్స్ కు కార్యకర్తలు ఈలలు వేశారు.
- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎల్కతుర్తి సభకు వెళ్లేముందు ట్యాంక్ బండుపై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల స్షూపం వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించారు.
- జనగామలో కేటీఆర్ కు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికి గజమాలతో స్వాగతం పలికారు. తన క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ భోజనం చేసి ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు.
- రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, కార్లు, ఎడ్లబండ్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలు చేతబట్టి ఎల్కతుర్తి సభకు తరలివచ్చారు.
- గులాబీ జెండాల రెపరెపలతో వరంగల్ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. గొడుగులతో కొందరు కార్యకర్తలు సభకు తరలివచ్చారు.
- ఎల్కతుర్తి సభా ప్రాంగళం గులాబీ జెండాల రెపరెపలు, కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో కళకళలాడింది.