అవయవదానం చేయటానికి కేటీఆర్ రెడీ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అభినందించిన బీఆర్ఎస్;

Update: 2025-03-27 09:55 GMT
KTR and Harish Rao

తెలంగాణ అసెంబ్లీలో అరుదైన ఘటన జరిగింది. అదేమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లుకు బీఆర్ఎస్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలపటం. ఇంతకీ విషయంఏమిటంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరిరోజైన గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అవయవదానం బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన బిల్లుపై కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలాగే అవయవదానం(Organ Donation Bill) లాంటి మంచిబిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. బిల్లు అసెంబ్లీ ఆమోదంపొంది చట్టమైతే వేలాదిమంది బాధితులకు ఎంతటి ఉపయోగం జరుగుతుందో హరీష్ లెక్కలతో వివరించటం ఆహ్వానించదగ్గ విషయమే.

ఈబిల్లుపై ముందు కేటీఆర్ మాట్లాడుతు అవయావదానం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని పిలుపిచ్చారు. అన్నీ నియోజకవర్గాల్లో అవయవదానం అంశంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజలందరిలో చైతన్యం తీసుకువస్తే అవయావదానం చట్టానికి సార్ధకత వస్తుందన్నారు. అవయవదానంపై సానుకూలంగా ఉన్న సభ్యులతో అసెంబ్లీలోనే సంతకాలు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఈ పనిచేస్తే మొదటిసంతకం తాను చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. అవయవదానం అన్నది చాలా గొప్ప మానవీయ చర్యగా అభివర్ణించారు. అవయవదానంపై జనాల్లో ఎంత చైతన్యం వస్తే అంతమంది బాధితులకు మంచిజరుగుతుందన్నారు.

హరీష్ రావు మాట్లాడుతు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహను అభినందించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు బాధితులకు ఎంతో ఉపయోగమన్నారు. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 3724 మంది అవయవదానంకోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లు వేలాదిమంది బాధితులకు ఉపయోగమన్నారు. ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ విషయాన్ని న్యూరో ఫిజీషియన్ మాత్రమే నిర్ధారించేవారని, కాని ఈబిల్లు వల్ల క్వాలిఫైడ్ డాక్టర్లందరికీ నిర్ధారించే అవకాశం దొరకటం సంతోషించాల్సిన విషయమన్నారు. జీవన్ దాన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్న విషయాన్ని హరీష్ గుర్తుచేశారు. తమ హయాంలో నిమ్స్, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిలో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగినట్లు చెప్పారు. రు. 20 లక్షలు ఖర్చయ్యే అవయవమార్పిడి ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూపాయి వ్యయంలేకుండా తమ హయాంలో వందలాది ఆపరేషన్లు చేయించినట్లు హరీష్ తెలిపారు.

Tags:    

Similar News