‘కవిత.. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావ్’
కాళేశ్వరం విషయంలో కవితకు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్.;
కాళేశ్వరం నిర్మాణం అవినీతి వెనక హరీష్ రావు హస్తం ఉందంటూ ఎమ్మెల్సీ కవిత భారీ బాంబ్ పేల్చింది. కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. కవితకు అంతే ధీటైన బదులిచ్చింది. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్ అన్న తరహాలో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. హరీష్ రావును ఉద్దేశించి ట్వీట్ చేసిన బీఆర్ఎస్.. ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క ఆరోపణకు ఆయన సాక్షాలతో సమాధానాలు ఇచ్చారని గుర్తు చేసింది. ‘‘ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు’’ అని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కవితపై బీఆర్ఎస్ దండయాత్ర మొదలుపెట్టిందని నెటిజన్స్ అంటున్నారు.
ముదిరిన కల్వకుంట్ల కలహం..
కల్వకుంట్ల కుటుంబంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ కవితకు కేటీఆర్‌కు పడటం లేదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కవిత గేర్ మార్చి హరీష్ రావును టార్గెట్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో హరీష్ రావు హస్తం ఉందని, విచ్చలవిడిగా అవినీతి చేయడం వల్లే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనను ఇరిగేషన్ శాఖ మంత్రిగా తొలగించారంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కల్వకుంట్ల కలహం మరింత ముదిరింది.
బీఆర్ఎస్ వర్సెస్ కవిత..?
ఇప్పుడు అసలు గొడవ అంతా కూడా కవితకు, బీఆర్ఎస్‌కు మధ్య అన్నట్లు మారింది. కవిత చేసిన వ్యాఖ్యలకు ఎవరో ఒక నేత కాకుండా.. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి రిప్లై వచ్చింది. దీంతో కవితను బీఆర్ఎస్ వెలివేసింది? అన్న చర్చ మొదలైంది. అంతేకాకుండా కవిత.. బహిరంగంగా కామెంట్ చేయడంతో బీఆర్ఎస్ కూడా బహిరంగంగానే రిప్లై ఇచ్చిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు బీఆర్ఎస్‌కు కవితకు ఏమాత్రం పొత్తు పొసగడం లేదన్న విషయం ఈ అంశంతో తేటతెల్లం అయింది.
ఇంతకీ కవిత ఏమన్నారంటే..
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా? అని ఆమె ప్రశ్నించారు. ‘‘వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు. అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు. నాపై కుట్రలు చేసిన సహించాను… కానీ కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నా. హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడు. అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. నేను.. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారు. కవిత భావోద్వేగం… కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత’’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.