కరీంనగర్ సిఐపై కేసు
శ్రావణ్ కుమార్ ఆత్మహత్యకు సిఐ కారణం;
కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై కేసు నమోదు అయ్యింది.
చొప్పదండికి చెందిన భార్యాభర్తల వివాదంలో సీఐ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి.
భార్య తరపు బంధువుల ప్రోత్సాహంతో భర్త శ్రావణ్ కుమార్ పై శ్రీలత కేసులు నమోదు చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ భర్త శ్రావణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావణ్ కుమార్ ఆత్మహత్య తర్వాత శాఖాపరమైన విచారణ చేసి శ్రీలతపై చర్యలకు ఉపక్రమించారు. విచారణ చేసి సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశారు. చొప్పదండికి చెందిన శ్రావణ్ కుమార్ కు బత్తుల నీలిమతో 2021వివాహమైంది. వీరికి నాలుగేళ్ల అమ్మాయి ఉంది. భార్య భర్తల మధ్య గొడవలు ముదరడంతో నీలిమ పుట్టింటికి వచ్చేసింది. భర్తపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో బెయిల్ రాకుండా చేస్తానని సిఐ శ్రీలత శ్రావణ్ కుమార్ ను బెదిరించింది. దీంతో శ్రావణ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రావణ్ కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు చొప్పదండి పోలీసులు శ్రీలతపై కేసు నమోదు చేశారు.