పోలీసుల వేధింపుల వల్లే మహిళ ఆత్మహత్యాయత్నం
ముల్కనూరు పోలీసులపై ఆరోపణలు;
హన్మకొండ జిల్లాలోని భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. 15 ఏళ్లక్రితం దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ వద్ద ముల్కనూరుకు చెందిన రమేష్ అప్పు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగిచ్చేయాలని చంద్రశేఖర్ వత్తిడి పెంచాడు. అయితే రమేష్ వినకపోవడంతో ముల్కనూరులో పంచాయతీపెట్టారు. ఈ పంచాయతీలో ఈ నెల 5న రమేష్ చంద్రశేఖర్ కి డబ్బులు ఇవ్వాలి. రమేష్ ఇచ్చిన మాట తప్పాడు. దీంతో రమేష్ ఇంటికి చంద్రశేఖర్ వెళ్లాడు. తాను తీసుకున్న డబ్బులు రమేష్ తిరిగి ఇవ్వకపోగా చంద్రశేఖర్ పై ముల్కనూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. దీంతో చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తన భర్త పై కేసు పెట్టడాన్ని చంద్రశేఖర్ భార్య తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.