తొలివిడత అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి: రేవంత్

ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణపై రాత్ర మరో భేటీ నిర్వహిస్తాం.

Update: 2025-10-09 09:28 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణలో ఉండగా మరోవైపు నోటిఫికేషన్ విడుదలకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గురువారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తొలివిడత అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని చెప్పారు. నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రాన్ని క్షేత్రస్థాయికి పంపాలని చెప్పారు. రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని, వారికి బీఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.

‘‘న్యాయపరమైన అంశాల నివృత్తికి గాంధీ భవన్‌లో ఒక కమిటీ ఉండాలి. టో‌ల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా చూడాలి. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికను పీసీసీ నిర్ణయిస్తుంది. పీసీసీ నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయొద్దు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్ పర్యవేక్షించాలి. ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణపై రాత్ర మరో భేటీ నిర్వహిస్తాం. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలి’’ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News