ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలు ఉండాలని ఆయన కోరుకున్నారు.;

Update: 2025-07-13 08:56 GMT

లష్కర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి సీఎం రేవంత్.. బోనం సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థించారు. ఈ ప్రత్యేక పూజల్లో సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, శ్రీగణేశ్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News