PV Sindhu | మా పెళ్లికి రండి,సచిన్‌కు పీవీ సింధూ జంట ఆహ్వానం

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ జంట పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తమ పెళ్లికి రావాలని కోరుతూ పీవీసింధూ, దత్తసాయిల జంట సచిన్ ను కలిసి ఆహ్వానించారు.;

Update: 2024-12-09 05:14 GMT
సచిన్ టెండూల్కర్ ను ఆహ్వానిస్తున్న పీవీ సింధూ జంట

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ జంట పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. తమ పెళ్లికి రావాలని కోరుతూ పీవీసింధూ, వెంకట దత్తసాయిల జంట భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిసి ఆహ్వానించారు.

- కాబోయే భర్తతో కలిసి ముంబయిలోని సచిన్ నివాసానికి వచ్చిన పీవీ సింధూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 22 వతేదీన పీవీ సింధూ, వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని వివాహమాడనున్నారు.

- రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో పీవీ సింధూ వివాహం జరగనుంది. డిసెంబరు 24వతేదీన హైదరాబాద్ నగరంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి పీటలు ఎక్కనున్న పీవీ సింధూ జంట ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు.


సచిన్ టెండూల్కర్ ఎక్స్ పోస్ట్
‘‘బ్యాడ్మింటన్‌లో స్కోర్ ఎల్లప్పుడూ 'ప్రేమ'తో మొదలవుతుంది, వెంకట దత్త సాయితో మీ అందమైన ప్రయాణం ఎప్పటికీ 'ప్రేమ'తో కొనసాగుతుందని నిర్ధారిస్తుంది! మమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ ఇద్దరికీ జీవితకాల జ్ఞాపకాలు, అంతులేని ఆనందాలు ఉండాలని కోరుకుంటున్నాను’’అంటూ సచిన్ టెండూల్కర్ పీవీ సింధూనుద్ధేశించి ఎక్స్ లో ఫొటోతో పోస్టు చేశారు.


Tags:    

Similar News