Caste Census | కుల గణను విజయవంతం చేసి తీరుతాం: భట్టి విక్రమార్క

కుల గణన విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన విజన్‌తో ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Update: 2024-11-21 10:37 GMT
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కుల గణన(Caste Census) విషయంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చాలా స్పష్టమైన విజన్‌తో ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు. తెలంగాణ అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందని, కానీ కొందరు కావాలని దీనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్వే మొదలైన తొలి రోజు నుంచి కూడా కొందరు పనిగట్టుకుని మరీ కుటుంబ సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారు ఇప్పటికైనా ఈ పనులను మానుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ప్రజావాణీ(Praja vani) కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కుల గణనకు కుంటు పడదని, దానిని తప్పకుండా విజయవంతం చేసితీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కుల గణన వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సర్వేను తీసుకొచ్చామని చెప్పారు. చాలా మంది తమ వివరాలు చెప్పడానికి శంకోచిస్తున్నారని, కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అందించే సమాచారం అంతా కూడా అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని భరోసా కల్పించారు భట్టి విక్రమార్క.

విద్య, వైద్యానికే పెద్దపీట

ప్రజా ప్రభుత్వం, ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటుందని, అందుకే ఈ ముఖాముఖీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజావాణితో పాటు పార్టీ భావజాలాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ గడిల మధ్య పాలన చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన అందిస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని, అందుకనే రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం భారీ మొత్తంలో నిధులు కూడా కేటాయిస్తున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని, ఈ పాఠశాలలను సకల సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. దాంతో పాటుగానే వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల అవసరాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డైట్ ఛార్జీలను 40 శాతం పెంచామని చెప్పారు. వైద్యం విషయంలో కూడా అనేక పథకాలను తెస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని వివరించారు.

ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం

‘‘రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి 50వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. గ్రూప్-1 పరీక్షలను సరైన రీతిలో నిర్వహించే సత్తా లేక పదేళ్లుగా వీటిని నిర్లక్ష్యం చేశారు. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా అధికారం వచ్చిన తొలి ఏడాదిలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్రలను తట్టుకుంటూ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతో పాటుగా మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో భాగంగానే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. మహిళా సంఘాలతో వెయ్యి మెగా ఓల్ట్‌ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నాం’’ అని తెలిపారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తాం

‘‘రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగానే అడుగులు వేస్తోందీ ప్రభుత్వం. అందులో భాగంగా ఆర్‌టీసీలోకి కూడా మహిళలను తీసుకొస్తున్నాం. ఆర్టీసీ బస్సు యజమానులుగా మహిళలను మార్చనున్నాం. అదే విధంగా పలు ఇతర రంగాల్లో కూడా మహిళల అభ్యున్నతికి ప్రాముఖ్యతనిస్తున్నాం’’ అని చెప్పారు.

Tags:    

Similar News