జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే: మహేశ్ కుమార్ గౌడ్

ఎంపీ అనీల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేతలు;

Update: 2025-07-19 11:50 GMT

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయమని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు.బనకచర్ల విషయంలో బావాబామ్మర్దులైన కెటిఆర్ , హరీష్ రావులు అబద్దాలు ఆడుతున్నారన్నారు.

ప్రజాపాలన చూసి బిఆర్ఎస్ నేతలు ఓర్వ లేకపోతున్నారన్నారు.ప్రజల ఆకాంక్ష మేరకే పాలన సాగుతుందన్నారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మురళీగౌడ్, సంజయ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి బిఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు

Tags:    

Similar News