కంట్లో కారంచల్లి కాల్చి చంపేశారు

చందు తప్పించుకునేందుకు లేకుండా చాలా ప్లాన్డ్ గా దుండగులు మొదట కంట్లో కారం చల్లినట్లు అర్ధమవుతోంది.;

Update: 2025-07-15 06:26 GMT
Firing in Dilshuknagar

కాల్పుల కలకలంతో హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ఏరియా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం దిల్ సుఖ్ నగర్ లోని ఒక పార్క్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న సీపీఐ లీడర్ చందూనాయక్ పై కొందరు కంట్లో కారంచల్లి కాల్పులు జరిపి చంపేశారు. వాకింగ్ చేస్తుండగా ఒక కారులో నలుగురు దుండగులు వచ్చి మొదట చందు కంట్లో కారంచల్లారు. వెంటనే కారులో నుండి కాల్పులు జరిపి చంపేశారు. చందు తప్పించుకునేందుకు లేకుండా చాలా ప్లాన్డ్ గా దుండగులు మొదట కంట్లో కారం చల్లినట్లు అర్ధమవుతోంది. ఆపై కారులో కూర్చునే చందుపై ఆరురౌండ్ల కాల్పులు(Firing) జరిపారు. కాల్పుల్లో చందు అక్కడికక్కడే చనిపోయాడు. కాల్పులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే వారిపైన కూడా తుపాకులు చూపించటంతో భయంతో వెనక్కువెళ్ళిపోయారు.

ఆపై చందుపైన కాల్పులు జరిపిన దుండగులు తాపీగా కారులోనే వెళ్ళిపోయారు. కాల్పులకు భూవివాదమే(Land dispute) కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదుచేసుకున్నారు. ప్రత్యక్షసాక్ష్యుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనాస్ధలంలో దొరికిన బుల్లెట్లను పోలీసులు స్వాధీనంచేసుకుని పరీక్షల నిమ్మితం ల్యాబుకు పంపారు సాక్ష్యులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కారు నెంబర్ తీసుకుని ట్రాక్ చేస్తున్నారు.

ఇదేవిషయమై ఈస్ట్ డీపీపీ చైతన్యకుమార్ మీడియాతో మాట్లాడుతు ఉదయం 7.30ప్రాంతంలో కాల్పలకు సంబందించిన సమాచారం అందినట్లు చెప్పారు. చందూనాయక్ వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన కొందరు కాల్పులు జరిపి చంపేసినట్లు తెలిపారు. ఘటనాస్ధలంలో ఏడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. 2022లో జరిగిన ఒక హత్యకేసులో చందు నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ చెప్పారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే కాల్పులు జరిపిన నలుగురు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ఓటీ) ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు నిర్ధరించలేదు. చందుతో పాటు కాల్పులు జరిపిన నలుగురు గతంలో జరిగిన ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి వీళ్ళమధ్య విభేదాలు మొదలైనట్లు అర్ధమవుతోంది.

Tags:    

Similar News