బెట్టింగ్ యాప్స్ కేసు.. రంగంలోకి సిట్
25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఈ రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేయనున్నారు.;
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. వీటి నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులు నిశ్చయించుకున్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ బృందాన్ని డీజీపీ జితేందర్ ఏర్పాటు చేశారు. ఐజీ ఎం రమేష్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తును కొనసాగిస్తోంది. ఏం రమేష్ తో పాటు sp లు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు sp చంద్రకాంత్, శంకర్ లు ఈ బృందంలో ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్ట తోపాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదయ్యాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఈ రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేయనున్నారు. 90 రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశించారు.