రేవంత్ కు ఆస్కార్, నోబెల్ ప్రైజ్ తెచ్చిన లెటర్లో ఏముందో తెలుసా ?
ఆ లెటర్ ఏమిటి ? దానికి రేవంత్ ఆస్కార్, నోబెల్ ప్రైజని, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని ప్రకటించటం ఏమిటనే విషయం చాలామందికి అర్ధంకాలేదు;
ఢిల్లీలో ఎనుముల రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతు ఒక లెటర్ ను చూపించి ‘ఇది తనకు ఆస్కార్, నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువ’ని చెప్పారు. ‘ఈలెటర్ తనకు రావటం అంటే తనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ దక్కినట్లుగా ఫీలవుతున్న’ట్లు చెప్పారు. రేవంత్(Revanth)మాటలకు సమవేశంలోని వారంతా ఒకటే తప్పట్లతో మారుమోగించేశారు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి ? దానికి రేవంత్ ఆస్కార్, నోబెల్ ప్రైజని, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని ప్రకటించటం ఏమిటనే విషయం చాలామందికి అర్ధంకాలేదు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి ? ఎక్కడినుండి వచ్చింది ?
ఇపుడు విషయం ఏమిటంటే ఆలెటర్ రేవంత్ కు రాసింది కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి(Sonia Gandhi). సందర్భం ఏమిటంటే తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన వివరాలను ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఇందిరభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కీలకనేతలందరికీ వివరించటం. ఈసమావేశానికి ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi), ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులంతా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి సోనియాగాంధీ మాత్రం హాజరుకాలేదు. అందుకనే రేవంత్ ను ఉద్దేశించి సోనియా ఒక లేఖను రాశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే ఏమీలేదు. అవును నిజమే ఆ లేఖలో రేవంత్ ను అభినందిస్తు సోనియా ఒక్క ముక్క కూడా రాయలేదు.
లేఖలో ఏముందంటే కులగణన వివరాల ప్రజంటేషన్ సందర్భంగా తనను పిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. సమావేశానికి తాను హాజరయ్యుంటే చాలా సంతోషించేదానిని అన్నారు. సమావేశానికి హాజరుకాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఫిక్సయిన కార్యక్రమాల వల్ల తాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. ప్రజంటేషన్లో పాల్గొన్నవారందరికీ అభినందనలు చెప్పారంతే. ఇంతకుమించి ఒక్క లైను కూడా లేదు. దీనికే రేవంత్ చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేశారు. స్టేజీమీద సోనియా రాసిన లేఖను చూపుతు తనకు సోనియా లేఖరాయటమే ఆస్కార్ అవార్డు(Oscar Award), నోబెల్ ప్రైజ్(Nobel Prize) వచ్చినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ సాధించానని ఫీలవుతున్నట్లు కూడా చెప్పారు.
సమావేశానికి హాజరుకాలేకపోతున్నాను అని రాసిన లేఖకే రేవంత్ ఆస్కార్ అవార్డు, నెబెల్ ప్రైజ్ వచ్చిందని ఫీలవుతున్నట్లు చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. కులగణన చేయటం అనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నందుకు, కులగణన చేసినందుకు సోనియా అభినందించను కూడా లేదు. రేవంత్ ను అడ్రస్ చేసిన లేఖలో కింద సోనియాగాంధి సంతకం ఉందంతే. ఇంతమాత్రానికే రేవంత్ ఇంతపెద్ద బిల్డప్ ఇచ్చారా ? అని అందరు హాస్చర్యపోతున్నారు.