ఈడీ ముందుకు అల్లు అరవింద్..

భారీ బ్యాంకు కుంభకోణంలో భాగంగా మూడు గంటలు కొనసాగిన ఈడీ విచారణ.;

Update: 2025-07-04 11:08 GMT

అల్లు అరవింద్.. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాత. ఓ బ్యాంకు స్కాం కేసులో ఈడీ.. ఆయనను విచారించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్‌ను ఈడీ అధికారులు మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ స్కామ్ 2018-19 మధ్య జరిగింది. దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈడీ దర్యాప్తును శరవేగంగా ముందుకు కొనసాగిస్తోంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే అల్లు అరవింద్‌ను అధికారులు విచారించారు. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు వచ్చే వారం మరోసార విచారణకు రావాలని చెప్పి పంపారు.

2024లో హైదరాబాద్, కర్నూలు, గజియాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. వీటిలో భాగంగా అధికారులు రూ.45లక్షలు సీజ్ చేశారు. నిందితులు రూ.101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో అకౌంట్ హోల్డర్స్‌గా ఉన్న వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంక్ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి వంద కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News