సన్నిహిత మిత్రుడే చందూనాయక్ హత్యకు పాల్పడ్డాడా?
పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న నిజాలు;
హైదరాబాద్ మలక్‌పేటలో సీపీఐ నేత చందు నాయక్‌పై కాల్పుల కేసులో పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతోంది. చందుపై కాల్పులు జరిపిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. పాత కక్ష్యల వల్లే కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తనకు ప్రాణ హాని ఉందని చందు ఇంతవరకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోలేదు. దీంతో చందూ నాయక్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తులు రాజేష్, సుధాకర్, శివ, బాషాగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు లొంగిపోయారు. కాల్పులకు కుంట్లూర్‌లోని భూ వివాదమే కారణమని నిర్ధారించారు. ఈ భూమి విషయమై గత కొద్ది రోజుల నుంచి రాజేష్‌కు చందు నాయక్‌కు మధ్య గొడవలు నడుస్తున్నాయి. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్‌లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేసుకున్నారు. దీంతో చందు నాయక్ పై రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సీపీఐ పార్టీలో చందు నాయక్ క్రియాశీలంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నారు. ఒకప్పుడు చందూనాయక్ తో రాజేశ్ క్లోజ్ గా ఉండేవాడు. నమ్మకంగా తిరుగుతూనే రాజేశ్ ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రచారంలో ఉంది. అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులు పోలీసులను వేడుకున్నారు.