హైకోర్టును ఆశ్రయించిన ‘గాలి’

బెయిల్ ఇస్తే అదే విధంగా నిబంధనలకు లోబడి ఉంటామన్న పిటిషనర్లు.;

Update: 2025-05-19 08:06 GMT

14 సంవత్సరాల దర్యాప్తు తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో నిందితులుగా ఉన్న ఏడుగురికి జీవితఖైధు విధించింది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా తాజాగా సీబీఐ కోర్టును ఛాలెంజ్ చేస్తూ పలువురు దోషులు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ ఉన్నారు. సీబీఐ కోర్టు తీర్పును కొట్టివేయడంతో పాటు తమకు బెయిల్ మంజూరు చేయాలని కూడా వీరు తమతమ పిటిషన్లలో పేర్కొన్నారు.

‘‘సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా లేదు. తమను దోషులుగా తేల్చడానికి సరైన సాక్షాధారాలు కూడా లేవు. ఇప్పటికే మూడున్నర ఏళ్ల పాటు జైలు ఉన్నాం. విచారణ సందర్భంగా బెయిల్ మంజూరు చేయినప్పుడు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ఇప్పుడు కూడా బెయిల్ ఇస్తే అదే విధంగా నిబంధనలకు లోబడి ఉంటాం’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వారు చంచల్‌గుడా జైల్లో ఉన్నారు.

కోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే..

అనేక కోణాల్లో కేసును దర్యాప్తుచేసిన సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిదిమందికి వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించేందుకు ఆధునిక టెక్నాలజీని సైతం ఉపయోగించింది. మొత్తానికి ఓఎంసీ కంపెనీ తనకు ఇచ్చిన భూములు ఓబుళాపురం గ్రామంలో 68.5 హెక్టార్లు, మల్పనగుడి గ్రామంలో 39.5 హెక్టార్లలోనే కాకుండా బళ్ళారి రిజర్వ్ ఫారెస్టులో కూడా తవ్వకాలు జరిపిందనేందుకు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించింది. ఇందుకోసం శాటిలైట్ ఇమేజెస్ ను ఉపయోగించుకున్నది. 14 సంవత్సరాల దర్యాప్తు తర్వాత అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టింది. 219 మంది సాక్ష్యులను విచారించి, 3400 డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందంకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు దొకరకలేదని కోర్టు నిర్ధారించింది. అలాగే గాలి జనార్ధనరెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి బీవీ శ్రీనివాసులరెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, గాలికి పీఏగా పనిచేసిన మొహిసిన్ ఆలీఖాన్ కు సీబీఐ కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తు తీర్పుచెప్పింది. పై ఐదుగురి వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రు. 880 కోట్ల ఆదాయానికి గండిపడిందని కోర్టు నిర్ధారించింది.

Tags:    

Similar News