ఇక భౌతిక దాడులు తప్పవ్.. మార్వాడీలకు స్ట్రాంగ్ వార్నింగ్

పిడమర్తి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న 11 సంఘాల నాయకులు.

Update: 2025-10-06 16:45 GMT

తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు కొత్త దుకాణాలు తెరిస్తే ఇక భౌతిక దాడులు చేస్తామని పిడమర్తి రవి హెచ్చరించారు.  ‘మార్వాడీ గో బ్యాక్’ వివాదం నివురుగప్పిన నిప్పులా మారింది. ఏమాత్రం గాలి తగిలినా భగ్గుమనేలా ఉంది. అటువంటి గాలే తాజాగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో వీచింది. మార్వాడీలకు ‘మార్వాడీ గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ పిడమర్తి రవి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా సోమవారం ‘మార్వాడీ గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. తన ఎన్నిక జరిగిన నేపథ్యంలోనే మార్వాడీలకు పిడమర్తి రవి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో మార్వాడీలు కొత్త షాపులు ఏర్పాటు చేస్తే ఒక భౌతిక దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

‘‘తెలంగాణలో కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు షాపులు పెట్టొద్దు. మార్వాడీలు కొత్త షాపులు పెడితే భౌతిక దాడులే కాదు షాపులను కూడా ధ్వంసం చేస్తాం. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రాన్ని కల్తీ చేశారు. దానిని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దీపావళి తర్వాత రాష్ట్రపర్యటన ఉంటుంది’’ అని రవి వివరించారు. ఈ సమాశంలో భాగంగానే జిల్లా అధ్యక్షులు, కన్వీనర్లో పాటు కమిటీ ఛైర్మన్ ఎంపిక జరిగింది. అంతేకాకుండా ‘మన రాష్ట్రం మన దుకాణం’ అన్న పోస్టర్‌ను విుదల చేశారు.

అసలేంటీ వివాదం..

ఆగస్టు 18న సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన చిన్న ఘటనతో ఈ వివాదానికి బీజం పడింది. మార్కెట్లో పార్కింగ్ విషయంలో మార్వాడీలకు ఒక దళిత యువకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన మార్వాడీలు.. ఆ దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించే పోలీసుల వద్ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసు నమోదు కావడంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. ఇదే సమయంలో మార్వాడీల దోపిడీని విమర్శిస్తూ గాయకుడు, రచయిత గోరేటి రమేశ్ ఓ పాట పాడారు. అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఆ పేటతో ప్రేరణ పొందిన స్థానికులు ‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఉద్యమం ప్రారంభించారు.

Tags:    

Similar News