చందానగర్‌లో కాల్పుల కలకలం..

Update: 2025-08-12 07:16 GMT

చందానగర్‌లోని ఖజానా జ్యూవెలరీలో కాల్పులు కలకలం రేపాయి. పట్టపగలే దోపిడీ ప్రయత్నించిన దుండగులు సిబ్బందిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చందానగర్‌లోని ఖజానా జ్యూవెలరీలో దోపిడీ చేయడానికి ముఠా చొరబడింది. తుపాకులు చూపి లాకర్ల తాళాలు ఇవ్వాలని సిబ్బందిని బెదిరించింది. అయినా తాళాలు ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తికి గాయమైంది. కాగా సిబ్బంది చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దోపిడీకి ముందే ముఠా.. షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది. దీంతో స్థానికుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. స్థానికుల చెప్పిన దాని ప్రకారం.. దుండగులు మొత్తం ఆరుగురు ఉన్నారు. ఆ వివరాల ప్రకారం, స్థానికంగా ఉన్న ఇతర సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సైబరాబాద్ సీపీ జిల్లా సరిహద్దు పోలీసులను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News