ఎంపవర్ కమిటీకి హరీష్ నివేదిక.. అందులో ఏముందంటే..

వన్య ప్రాణుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. 11 పేజీలతో రిప్రెంజంటేషన్ ఇచ్చాం. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ ఇచ్చామని చెప్పారు హరీష్.;

Update: 2025-04-10 11:41 GMT

కంచె గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో ఆ భూములను పరిశీలించడానికి ఎంపవర్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన కమిటీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తర్వాత తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నారు. ఈ క్రమంలో హోటల్ తాజ్ కృష్ణలో ఎంపవర్ కమిటీని మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం కలిసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో రేవంత్ సర్కారు జరుపుతున్న పర్యావరణ విధ్వంసం, ఉల్లంఘనలు, హెచ్‌సీ‌యూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు లేవనెత్తుతున్న అంశాలు, వాస్తవాలతో కూడిన నివేదికను కమిటీకి అందించారు.

‘‘కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించింది. పండుగ రోజులుల, సెలవు దినాల్లో పర్యావరణ విధ్వంసం చేసింది. అన్ని వివరాలతో సెంట్రల్ కమిటికి నివేదించాం. అడవుల విధ్వంసం, కమిటీ మమ్మల్ని ప్రశ్నలు వేసారు, అన్నిటికి సమాధానాలు చెప్పాం. పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల పెనాలిటి వేస్తారు. వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.

‘‘రైతుకు ఒక న్యాయం, సీఎం కు ఒక న్యాయమా. రైతుకైనా, పేద వాడికైనా ముఖ్యమంత్రికి అయినా న్యాయం సమానంగా ఉండాలి. ఎవరికైనా ఇల్లు కట్టాలంటే వాల్టా చట్టం ప్రకారం, గ్రామీణంలో రూ.50, పట్టణంలో రూ.100 చలాన కట్టి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత కమిటీ చెప్పిన ప్రకారం, రూ. 450 డిపాజిట్ చేయాలి. ఒకటి బదులు రెండు చెట్లు పెట్టాలని నిబంధన ఉంటుంది. అలా అనుమతి పొందిన తర్వాత చెట్టు కొట్టాలి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏం జరిగింది. అటవీశాఖకు ఒక్క దరఖాస్తు కూడా పెట్టలేదు. నిజానికి అటవీ భూమిలో కాదు, సొంత భూమిలో చెట్టు కొట్టినా అనుమతి పొందాలి’’ అని తెలిపారు.

‘‘కంచె చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేస్తున్నది. వేలాది చెట్లను నరుకుతున్నది. చెట్లు కొట్టడానికి పోలీసు స్టేషన్లలో టిజిఐఐసి దరఖాస్తు చేసింది. పోలీసులు న్యాయబద్దమైన పనా కాదా అని ఆలోచన చేయాలి కదా టీజీఐఐసీ దరఖాస్తే నేరపూరితమైంది. చెట్లు నరకడానికి ఫారెస్టు అనుమతి ఉందా, వాల్టా చట్టం అనుమతి ఉందా అని అడిగి పోలీసులు అనుమతి ఇవ్వాలి. పోలీసు రక్షణలో రాత్రింబవల్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోశారు. మూడు జింకలు చనిపోయిన పరిస్థితి. ఆవాసాలు కోల్పోయి జంతువులు ఇండ్లకు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను చంపితే జైలులో పెట్టారు. మూడు జింకలు చంపితే రేవంత్ రెడ్డి పై ఏం చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలి. 7 సంవత్సరాలు శిక్ష వేయాలని చట్టంలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘మూడు జింకలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా. గ్రామాల్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇక్కడే ఉన్న పీపీబీ. అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయి. నిద్రపోతున్నారా? పేదలు చెట్టు కొడితే కేసులు పెట్టిన వారు, వేలాది చెట్లు ఊచ కొత కోస్తే నిద్ర పోతున్నారా? ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పీసీసీఎఫ్ గారికి రెండో ఏప్రిల్ నాడు లెటర్ రాశారు. అనుమతి లేకుండా చెట్లు కుడుతున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించరా? యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించడం లేదా? అటవీ శాఖ నేరపూరిత నిర్లక్ష్యం వేల సంఖ్యలో చెట్లు కుప్ప కూలాయి, జింకలు మృత్యువాత పడ్డాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అనేక రకాల ఉల్లంఘనలు జరిగాయి’’ అని ఆరోపించారు.

‘‘2002 వాల్టా యాక్టు ప్రకారం, ఎవరైనా చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకోవాలి. 2017 జీవో నెంబర్ 23 ప్రకారం, చెట్టు కొట్లాలంటే ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి, అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ 2025 మార్చి 4 ఫారెస్టు భూమి అని రాయాల్సిన అవసరం లేదు. ఫారెస్టు నేచర్ కలిగిన భూముల వివరాలు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరింది. ఆ కమిటీ ఒకవైపు పని చేస్తున్నది. వీళ్లు ఆ భూములను గుర్తించి తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అశోక్ కుమార్ శర్మ ఐఎఫ్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఉల్లంఘన జరిగింది. ఫారెస్టు నిర్వచనం, అటవీ భూమే కాదు, పట్టా అయినా పది హెక్టార్ల కంటే 0.4డెన్సిటీ ఆఫ్ చెట్లు 1980 గోదావర్మన్ తీర్పులను ఉల్లఘించింది’’ అని అన్నారు.

‘‘1967 రాష్ట్ర ఫారెస్ట్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో 2011లో లక్షల మొక్కలు పెట్టారు, మన్మోహన్ కూడా మొక్కలు నాటారు. హైడ్రా విషయంలో శని ఆదివారాల్లో కూల్చొదన్ని హైకోర్టు కూడా చెప్పింది. దాన్ని కూడా ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉగాది, రంజాన్ సెలవులు చూసుకొని ఉల్లంఘనలు చేశారు. వణ్యప్రాణులను రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నది ప్రభుత్వం. ఇవన్నీ కమిటికి ఆధారాలతో సహా వివరించాం. 22 అక్టోబర్ 2024 నాడు ఈ భూమిని తాకట్టు పెట్టి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుంది. అప్పు ఇప్పించిన వ్యక్తికి రూ.169 కోట్ల 84 లక్షల బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘రేవంత్ రెడ్డి ఘనకార్యం నిర్వాకం ఏమిటంటే అప్పు ఇప్పించేటందుకు బ్రోకర్లు పెట్టుకోవాల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఇది టీజీ ఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా భయం లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ హయాంలో కొత్త సెక్రటేరియెట్ ను కట్టాలని నిర్ణయం తీసుకుంటే, పదో ఇరవయ్యో చెట్లను నరుకుతున్నారని గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారూ? వందల ఎకరాల్లో లక్షల కొద్దీ చెట్లు కొడుతున్న సీఎం గారిపై, సీఎస్ గారిపై, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

‘‘సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నించిన పాపానికి వారిని జైళ్లో పెట్టారు, పది రోజులుగా వాళ్లు జైల్లో ఉన్నారు. దీనికి బాధ్యత హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదే. వాళ్లను విడుదల చేయమని ఉప ముఖ్యమంత్రి చెబుతారు ఎందుకో మరి? ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థులు చేస్తే అరెస్టు చేసి, జైల్లో పెడతారా? ప్రభుత్వం అన్ని చట్టాలనూ ఉల్లంఘిస్తున్నది. ఈ విషయాలన్నింటినీ మేం కమిటీకి నివేదించాం. డీజీపీ, సీఎంపై ఏ పోస్టు పెట్టినా వారిని జైల్లో పెడుతున్నారే. మరి ఇవాళ వేలాది చెట్లు నరికినా, జింకలను చంపినా ఎందుకు కనిపించడం లేదు. జీవ విధ్వంసం మీ కళ్లకు కనిపంచడం లేదా... ఎందుకు కేసులు పెట్టరు?’’ అని నిలదీశారు.

‘‘నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివారూ నేరస్తులే. అందరూ కలిసే నేరం చేశారు. ఆ భూములు హెచ్ సీ యూ కే చెందాలని మేం కమిటీకి విన్నవించడం జరిగింది. మేం కొట్టిన వాటిలో కేవలం సుబాబుల్ చెట్లు మాత్రమే ఉన్నయని అటవీ అధికారులు చెబుతున్నారు. సుబాబులే కాదు.. సుగంధ పరిమళాలిచ్చే సుబాబుల్ చెట్లున్నాయి. అనేక ఔషధ మొక్కలున్నాయి. ఈ భూముల్లో చెరువు కూడా ఉన్నది. HCU భూముల్లో చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారు’’ అని ఆరోపించారు.

Tags:    

Similar News