బీజేపీ కోరిక తీర్చేసిన రేవంత్

కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే కాళేశ్వరం(Kaleshwaram Scam) కేసును రేవంత్ (Revanth)ప్రభుత్వం సీబీఐ అప్పగించటంలేదని కూడా కేంద్రమంత్రులు ఆరోపించారు.;

Update: 2025-09-01 04:30 GMT
Revanth in Assembly

సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న బీజేపీ డిమాండును ఎనుముల రేవంత్ రెడ్డి తీర్చేశాడు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే కాళేశ్వరం అవినీతి దర్యాప్తు కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగాయని బయటపడినప్పటినుండి కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఏమనంటే కాళేశ్వరం అవినీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని. కేసును సీబీఐకి అప్పగిస్తే వెంటనే కేసులు నమోదుచేసి కేసీఆర్(KCR) ను జైల్లోకి నెట్టేసేవాళ్ళమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి చాలాసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే కాళేశ్వరం(Kaleshwaram Scam) కేసును రేవంత్ (Revanth)ప్రభుత్వం సీబీఐ అప్పగించటంలేదని కూడా కేంద్రమంత్రులు ఆరోపించారు. అవినీతిపై 16 మాసాలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Commission) విచారించిన తర్వాత ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఆ రిపోర్టుపైనే ఆదివారం అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

అసెంబ్లీలో దాదాపు 8 గంటలు చర్చ జరిగిన తర్వాత కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రేవంత్ ప్రకటించారు. ఈ ప్రకటనతో కేంద్రమంత్రుల కోరికను రేవంత్ తీర్చినట్లయ్యింది. రేవంత్ అయితే కేంద్రమంత్రుల కోరికను తీర్చేశాడు మరి కేంద్ర దర్యాప్తు సంస్ధ ఏమిచేయబోతోంది ? అన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది. ప్రతిపక్షాలకు చెందిన నేతలను కేసుల పేరుతో ఒత్తిడిలోకి నెట్టి చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు అని నరేంద్రమోదీ, అమిత్ షా పై చాలాకాలంగా విపక్షాల నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఆరోపిస్తున్నట్లుగానే ప్రతిపక్షాలకు చెందిన చాలామంది నేతలపై సీబీఐ, ఈడీ, ఐటి కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి జైళ్ళకు కూడా పంపతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, హేమంత్ సోరేన్, సంజయ్ రౌత్, టీఎంసీ నేతలను ప్రతిపక్షాల నేతలు ఉదాహరణలు చూపుతున్నారు. అయితే వీళ్ళ ఆరోపణలకు మోదీ, అమిత్ షా అంతే ధీటుగా బదులిస్తున్నారు. అవినీతికి పాల్పడిన కారణంగానే ప్రతిపక్షాల నేతలపై దర్యాప్తు సంస్ధలు కేసులు నమోదుచేసి యాక్షన్ తీసుకుంటున్నాయని మోదీ బహిరంగసభల్లో చెబుతున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా ఇపుడు కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సీబీఐ దగ్గర సంవత్సరాలుగా 7072 కేసులు పెండింగులో ఉన్నాయి. తాజా కేసును సీబీఐ టేకప్ చేస్తే కేసుల సంఖ్యకు మరొకటి కలిపి 7073 అవుతుందంతే. సీబీఐ వెంటనే కేసును టేకప్ చేసేసి, దర్యాప్తు జరిపేసి కేసీఆర్, హరీష్ మీద కేసులు నమోదుచేసి అరెస్టులు చేసేస్తుందనే భ్రమలు ఎవరిలోను లేవు. అయితే ఇంతకాలం సీబీఐ దర్యాప్తుకు పదేపదే డిమాండ్ చేసిన కిషన్, బండి ఇపుడు ఏమిచేస్తారు అన్నదే కీలకం.

Tags:    

Similar News