హెచ్ సిఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

సన్ రైజర్స్ ను బెదిరించిన కేసులో;

Update: 2025-07-09 14:47 GMT

సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ మోహన్ రావుతో బాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజిలెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టులో జగన్ మోహన్ రావు బెదిరించినట్లు తేలింది.గత ఐపిల్ లో సన్ రైజర్స్ తో హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవలు జరిగాయి. తనకు 20 శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వాలని జగన్ మోహన్ రావు సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. రిక్వెస్ట్ పెట్టుకుంటే పరిశీలిస్తామని సన్ రైజర్స్ చెప్పింది. ఫ్రీగా ఇవ్వకుంటే మ్యాచ్లు జరగనిచ్చే ప్రసక్తి లేదని సన్స్ రైజర్స్ ను హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ బెదిరించింది. లక్నో మ్యాచ్ సందర్బంగా విఐపి బాక్స్ కు ఆయన తాళాలు వేశారు. సన్ రైజర్స్ హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అప్పటికే 10 శాతం టికెట్లు ఉచితంగా ఇచ్చింది. తనకు ప్రత్యేకంగా మరో 20 శాతం ఇవ్వాలని జగన్ మోహన్ రావు బెదిరించినట్టు విజిలెన్స్ శాఖ నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మీదే జగన్ మోహన్ రావు అరెస్ట్ అయ్యారు.

Tags:    

Similar News