హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారి చేసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. షేక్ పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ స్థంభించింది. రాయదుర్గం, షేక్ పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.