‘కేసీఆర్‌కు నష్టం చేయడానికే పీసీ ఘోష్ నివేదిక’
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నివేదికను కేసీఆర్‌కు మాత్రం అందించలేదన్న న్యాయవాది.;
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేసీార్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. ఈ పిటిషన్ల విచారణ వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్, కేసీఆర్‌లకు నివేదిక కాపీలు ఇవ్వలేదని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ల విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్యామ సుందరం వాదనలు వినపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.. వాదనలు వినిపించారు. కాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రూపొందించడంలో నిబంధనలు పాటించలేదని సుందర్వం.. కోర్టుకు వివరించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా నివేదికను కేసీఆర్, హరీశ్‌రావుకు ఇవ్వలేదని చెప్పారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్‌కు నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విలేకరుల సమావేశంలో సీఎం కమిషన్ నివేదిక వివరాలను తెలిపారని అన్నారు. వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేశారని, కేసీఆర్‌కు మాత్రం నివేదిక కాపీలు ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని కేసీఆర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేసిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానానికి వివరించారు. ఇద్దరు పిటిషనర్లు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది. 60 పేజీల రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఉంచారా? పిటిషనర్లకు 8B నోటీసులు ఇచ్చారా లేదా? కమిషన్ నివేదిక ప్రస్తుత స్థితి ఏమిటి? రిపోర్ట్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారా? ఈ ప్రశ్నలకు ఏజీ సమాధానమిస్తూ, నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కేసీఆర్ కమిషన్‌కు లేఖ రాశారని కోర్టుకు తెలియజేశారు. కేసీఆర్ లేఖను కూడా హైకోర్టుకు అందజేశారు. కేసీఆర్ కోరిన అన్ని కాపీలను అందించామని తెలిపారు. మేము ఇచ్చిన కాపీనే 8B నోటీసు అవుతుందని స్పష్టం చేశారు. ఒక సెక్షన్ స్పష్టంగా పొందుపరచకపోయినా, అది 8B నోటీసే అవుతుందని వాదించారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో తప్పనిసరిగా చర్చించాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. కౌంటర్‌లో మరిన్ని వివరాలు సమర్పిస్తామని తెలిపారు. ఇక ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని, అసెంబ్లీలో చర్చ పూర్తైన తర్వాత తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ హైకోర్టును కోరారు.